కొడాలి నాని టార్గెట్ గా చంద్రబాబు మాస్టర్ ప్లాన్!!

మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గెలుపు గుర్రాలకు నియోజకవర్గ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రచిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పని మొదలుపెట్టారు.

టీడీపీలో వివిధ నియోజకవర్గాలలో ఉన్న అంతర్గత విభేదాలకు చెక్ పెడుతూ అందరిని ఏకతాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై బాగా ఫోకస్ చేస్తున్న చంద్రబాబు గుడివాడ నుంచి కొడాలి నాని ని ఓడించాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.

Chandrababu Master Plan to defeat Kodali Nani in gudivada!!

చంద్రబాబుపై నిత్యం తీవ్ర వ్యాఖ్యలు చేసే కొడాలి నానిని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అక్కడ ఈసారి కొడాలి నాని కి చెక్ పెట్టే ప్లాన్ మొదలు పెట్టింది. అయితే గత ఎన్నికలలో చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.ముందు తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తే ఆపై ప్రత్యర్ధిని గట్టిగా టార్గెట్ చెయ్యొచ్చు అని భావించిన టీడీపీ అధినేత అందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.

టికెట్ కోసం పోటీ పడుతున్న రావి వెంకటేశ్వరరావు, చిన్నారి నేత వెనిగండ్ల రాముని ఏకం చేశారని టాక్. అనేక భేటీల తర్వాత చివరికి ఇద్దరినీ చంద్రబాబు ఏకం చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో గుడివాడ నుండి వెనిగండ్ల రాము పోటీ చేస్తారని సమాచారం. అంగబలం, అర్థబలం ఉన్న రాము కొడాలి నానిని దీటుగా ఎదుర్కొంటారని చంద్రబాబు భావిస్తున్నారు.

వెనిగండ్ల గెలుపుకు రావి తనవంతు పూర్తి సహకారం అందిచబోతున్నారని టాక్ వినిపిస్తుంది. పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే రావికి చంద్రబాబు ఎంఎల్సీ ఇచ్చేట్లు ఒప్పందం జరిగిందని సమాచారం. వెనిగండ్ల గెలుపుకు రావి సహకరిస్తారా అన్నది పక్కన బెడితే, కొడాలి నాని ఓటమి టార్గెట్ అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+