రాజధాని, ఎపి సమస్యలు: జైట్లీతో బాబు 40 ని.లు భేటీ
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం రానున్న బడ్జెట్లో నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే రూ. 7 వేల కోట్లను మార్చిలోగా సమకూర్చాలన్నారు.
లోటు బడ్జెట్‌ను భర్తీ చేయాలని కోరారు. ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంల నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయించాలని జైట్లీకి విజ్ఞప్తి చేశారు.

అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం ఎంపీ సుజనా చౌదరి మాట్లాడారు. ఐఐటీ, ఎయిమ్స్, ఐఐఎంల కోసం వచ్చే బడ్జెట్‌లో నిధులు ఇవ్వాలని జైట్లీని కోరినట్లు చెప్పారు. పోలవరానికి వచ్చే మార్చికల్లా రూ.7వేలకోట్లు అవుతుందని చెప్పామన్నారు. మార్చి నాటికి అదంతా ఇవ్వాలని, రాష్ట్ర లోటు బడ్జెట్‌ను కూడా భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు.
కాగా, అరుణ్ జైట్లీ కన్నా ముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. చమురు శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్‌తోను సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications