వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌తో బాబు: చెక్కు స్వీకరిస్తూ కొడుకు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాలు, అందులో తీసుకున్న కొన్ని ముఖ్యమైన తీర్మానాలను చంద్రబాబు గవర్నర్‌కు వివరించారు.

రాజధాని నిర్మాణం ఎక్కడన్న అంశంపై మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం, దానిపై శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించడంపైకూడా గవర్నర్‌కు వివరించారు. శుక్రవారం తిరుపతిలో జరగనున్న 12వ ఆర్ధిక సంఘం సమావేశంపై కూడా వివరించారు. సాధారణంగా ఆర్ధిక సంఘం నుంచే వచ్చే మొత్తానికి అదనంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కోరుతున్న నిధులపై గవర్నర్‌కు వివరించారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నారై రాజ్ శెట్టిపల్లి నుంచి రూ. 5 లక్షల చెక్కును అందుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.10,116 విరాళాన్ని నారా లోకేష్‌కు చప్పిడి జయచంద్ర నాయుడు అందించారు.

గవర్నర్‌తో బాబు భేటీ

గవర్నర్‌తో బాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

రాజధానిపై గవర్నర్‌కు

రాజధానిపై గవర్నర్‌కు

రాజధాని నిర్మాణం, వివిధ సంస్థల ఏర్పాటు, జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్న అభివృద్ధికి నిధుల అవసరం ఎంతో ఉందని చంద్రబాబు గవర్నర్‌కు వివరించారు.

కేంద్రం, ఆర్థికి సంఘాలపై ఒత్తిడి

కేంద్రం, ఆర్థికి సంఘాలపై ఒత్తిడి

నిధుల కోసం అటు కేంద్రంపైనా, ఇటు ఆర్ధిక సంఘంపై కూడా ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు వివరించారు.

చెక్కు అందుకుంటూ లోకేష్

చెక్కు అందుకుంటూ లోకేష్

చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ గురువారంనాడు విరాళాలను చెక్కుల రూపంలో అందుకున్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu met governor Narasimhan at Rajbhavan. meanwhile, Nara Lokesh accepted cheques from donors for capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X