దేవాన్ష్ పుట్టిన రోజు: టీటీడీకి భూరీ విరాళం, శ్రీవారి సన్నిధిలో నారా, నందమూరి ఫ్యామిలీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకున్నారు. మార్చి 21న తన మనవడు, నారా లోకేష్-బ్రాహ్మణిల కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు కావడంతో తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకున్నారు.

దేవాన్ష్ బర్త్ డే.. టీటీడీకి రూ. 30 లక్షల విరాళం

దేవాన్ష్ బర్త్ డే.. టీటీడీకి రూ. 30 లక్షల విరాళం

అనంతరం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ. 30 లక్షలు విరాళంగా అందజేశారు. దేవాన్ష్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను గత నాలుగేళ్లుగా తిరుమల శ్రీవారి సన్నిధిలోనే నిర్వహిస్తున్నారు.

శ్రీవారి సేవలో నారా, నందమూరి కుటుంబం..

శ్రీవారి సేవలో నారా, నందమూరి కుటుంబం..

ఆదివారం ఉదయం స్వామివారి ఆలయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడుకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి తనయుడు దేవాన్ష్, ప్రముఖ సినీటుడు బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కాగా, దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు అన్న ప్రసాదం వితరణకు అయ్యే ఖర్చులను చంద్రబాబు కుటుంబం వెచ్చిస్తోంది.

తమ కుటుంబంలో దేవాన్ష్ ఆనందం నింపాడంటూ లోకేష్..

నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. దేవాన్ష్ తమ కుటుంబంలోకి వచ్చిన నాటి నుంచి ఎంతో ఆనందాలను పంచుతున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి ఆనందాన్నిచ్చినందుకు థ్యాంక్యూ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

తిరుపతి ఉపఎన్నికపై చంద్రబాబు ఫోకస్

తిరుపతి ఉపఎన్నికపై చంద్రబాబు ఫోకస్

ఇది ఇలావుంటే, ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరుగనుండగా.. చంద్రబాబు తిరుమల పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతి టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ఇటీవల ప్రకటించిన చంద్రబాబు.. ఇక ప్రచారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. వైసీపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది.

ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థికే జనసేన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రచారం చేయనున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. గెలుపు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+