వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న జయలలిత లేఖ, నేడు తమిళనాడులో బాబు దిష్టిబొమ్మ దగ్ధం

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఎర్రచందనం కేసులో 32 మంది తమిళులను తిరుపతిలో అరెస్టు చేయడంపై తమిళనాడులో నిరనసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ తీరును నిరసిస్తూ సోమవారం నాడు స్థానిక కోయంబేడు బస్ స్టేషన్లో తమిళ మున్నేట్ర పడై ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

కోయంబేడు బస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ఆందోళనకారులు నిర్బంధించారు. ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమిళ మున్నేట్ర పడై అధ్యక్షురాలు వీరలక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తిరుపతికి తీర్థయాత్రకు వెళ్లిన 32 మందిని అరెస్టు చేయడం, పాలారు డ్యాం ఎత్తు పెంచడం పట్ల నిరసనగా ఈ ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. అరెస్టు చేసిన 32 మంది తమిళులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Chandrababu Naidu effigy burns

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రానికి చెందిన 32 మందిని ఎర్రచందనం దుంగలు కొట్టే వారిగా భావించి అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయాలని, ఇందులో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అసలెందుకు అరెస్ట్ చేశారో, చూడండి: బాబుకు జయలలిత లేఖఅసలెందుకు అరెస్ట్ చేశారో, చూడండి: బాబుకు జయలలిత లేఖ

ఎర్రచందనం కేసులో 32 మంది తమిళులను తిరుపతిలో అరెస్టు చేయడంపై తమిళనాడులో నిరనసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ తీరును నిరసిస్తూ సోమవారం నాడు స్థానిక కోయంబేడు బస్ స్టేషన్లో తమిళ మున్నేట్ర పడై ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

English summary
AP CM Chandrababu Naidu effigy burns in Tamil nadu for arresting 32 wood cutters in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X