కేసీఆర్ కంటే తక్కువ..! నాకు ఆ ర్యాంక్ ఇస్తారా: మోడీపై బాబు అసహనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ చేయించిన సర్వే పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వేను కొట్టి పారేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మొదటి స్థానం, ఏపీ సీఎం చంద్రబాబుకు 13వ స్థానం వచ్చింది.

సర్వే: కెసిఆర్ నెంబర్ వన్, 13వ స్థానంలో చంద్రబాబు

మరోవైపు, చంద్రబాబుకు అయిదో స్థానం వచ్చినట్లుగా టిడిపి నేతలు, చంద్రబాబు చెబుతున్నారని అంటున్నారు. చంద్రబాబుకు వచ్చింది 13వ స్థానం కాదని, అయిదో స్థానమంటున్నారు. అయితే, 5వ స్థానం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వచ్చిందని తెరాస నేతలు చెబుతున్నారు.

ప్రధాని నిర్వహించిన సర్వేలో తనకు అయిదో స్థానం వచ్చిందని చంద్రబాబు చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. తనకు అయిదో స్థానం రావడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

 Chandrababu Naidu had dismissed survey

ఏపీలోని సంక్షేమ పథకాలు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయని, ఏపీ పథకాలు మొదటి స్థానంలో ఉంటే ముఖ్యమంత్రికి అయిదో స్థానం ఎలా వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. పథకాలు మొదటి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్మంత్రి కూడా మొదటి స్థానంలోనే ఉండాలని బాబు అన్నారని తెలుస్తోంది.

మరో రగడ... విభజనకు ముందే తీసుకుంటారా: తెలంగాణపై హైకోర్టు

తనకు అయిదో ర్యాంకు రావడంపై ఆయన తీవ్రంగా అప్ సెట్ అయ్యారని అంటున్నారు. అంతేకాదు, ఈ సర్వేల పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారని అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమకు అనుకూలంగా సర్వేలు చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారని సమాచారం. మరో ఆసక్తికర విషయమేమంటే ఏపీ ప్రభుత్వం తరఫున ప్రయివేటు ఏజెన్సీలు చేస్తున్న సర్వే పైన కూడా చంద్రబాబు అదే సమయంలో మాట్లాడారట.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sources said Mr Naidu dismissed the survey saying: “Everybody is conducting surveys according to their whims and fancies”. Interestingly in the same meeting Mr Naidu was briefed on survey conducted by a private agency on behalf of the AP government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి