మరో రగడ... విభజనకు ముందే తీసుకుంటారా: తెలంగాణపై హైకోర్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన ఆస్తులను తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థకు బదలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మే 6వ తేదీన జారీ చేసిన ుత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఏపీకి చెందిన ఆ సంస్థ ఎండీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పైన బుధవారం ుమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆస్తులు, బాధ్యతల విభజన జరగకముందే బదలీ ఎలా చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్‌కు సంబంధించిన ఆస్తులను ఏకపక్షంగా ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించింది. ఆస్తులు, బాధ్యతలు విభజన జరగకుండా ఇదెలా సాధ్యమని అడిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏజీ కె రామక్రిష్ణారెడ్డి కల్పించుకుంటూ.. సంబంధితశాఖ కార్యదర్శితో మాట్లాడి సవరణ జీవో తెస్తామని, అందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.

ఏపీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్‌ రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉందని, ఈ కార్పోరేషన్‌కు సబంధించి ఆస్తులు, బాధ్యతల పంపకాలు జరగలేదని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆస్తులు స్వాధీనం చేసుకుంటూ జీవో జారీచేసిందని కోర్టుకు తెలిపారు.

TS, AP spar over Vijaya Dairy assets

ఈ కార్పొరేషన్‌ ఆస్తులు, బాధ్యతల పంపకాల కోసం కేంద్రాన్ని వివరణ కోరామని, ఇంకా కేంద్ర నిర్ణయం రాకుండానే ఆస్తుల స్వాధీనంకోసం జీవో జారీ చేసి సికింద్రాబాద్‌ లాలాపేట్‌లోని ప్లాంట్‌ అండ్‌ మిషనరీని, సోమాజిగూడలోని అతిథి గృహాన్ని బదిలీ చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.

ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం.. ఇటువంటి అంశాల్లో ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ఏజీని ప్రశ్నించింది. అయితే, వీటిని ఏకపక్షంగా స్వాధీనం చేసుకోలేదని, విభజన చట్టంలోని సెక్షన్-53 ప్రకారం ఏప్రాంతంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని స్పష్టంగా ఉందని చెప్పారు.

చట్టప్రకారం వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ఉందని తెలిపారు. పాలనా భవనంలోని 4 అంతస్థుల్లో 2 ఏపీకి కేటాయించామని, 2 అంతస్థులు తెలంగాణ వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఈ వివరణపై డివిజన్‌ బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరింత స్పష్టతకు గడువు కావాలని కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana State, and Andhra Pradesh spar over Vijaya Dairy assets.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి