పీవీ కల సాకారం, సీమతో అమరావతి లింక్: రైలు మార్గాన్ని ప్రారంభించిన బాబు, వెంకయ్య, ప్రభు
అమరావతి: నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గాన్ని రిమోట్ ద్వారా మంగళవారం కేంద్రం మంత్రులు సురేష్‌ప్రభు, వెంకయ్యనాయుడులతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ. 967 కోట్ల వ్యయంతో 123 కిలోమీటర్ల మేర నిర్మించిన నూతన రైలు మార్గంతో పాటు నంద్యాల-కడప డెమో రైలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. ఈ రైలు మార్గం ద్వారా కొత్త రాజధాని అమరావతితో రాయలసీమను కలుపుతున్నామని అన్నారు. అనంతరం మాట్లాడిన వెంకయ్య నాయుడు కేంద్రం ఏపీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని అన్నారు.
Nandyal to Yerraguntla connecting two districts of Rayalaseema become reality after 4 decades @ncbn @sureshpprabhu pic.twitter.com/CbxpeEXZX3
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2016
New Rail line between Nandyala and Yerraguntla & Flagging of passenger from Nandyala to Kadapa@sureshpprabhu @ncbn pic.twitter.com/KPQ3c0QX34
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2016
నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ నిర్మాణం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కలని, గత రైల్వే మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. రైల్వేల్లో పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోడీ సూచించారని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు.
Flgd off Nandyal-Kadapa new train. Enhncd connectivity 2 vast areas of Kadapa,Kurnool districts,many holy places too pic.twitter.com/9JK6VCgPRi
— Suresh Prabhu (@sureshpprabhu) August 23, 2016
ఎన్డీఏ ప్రభుత్వం రైల్వేల ఆధునీకరణపై దృష్టిపెట్టిందని, పుష్కరాల సందర్భంగా రైల్వేశాఖ పనితీరు బాగుందని ఆయన ప్రశంసించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వేల విషయంలో ఇంత కాలం ఏపీకి అన్యాయం జరిగిందని, రైల్వే మంత్రి సురేష్‌ప్రభు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
రాయలసీమలో ఇదే కీలకమైన రైలు మార్గమని చెప్పారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా 41లక్షల మంది యాత్రికులు రైళ్లలో ప్రయాణం చేశారని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. చెన్నై-ఢిల్లీ వయా విజయవాడ, విజయవాడ- ఖరగ్‌పూర్ వయా విశాఖ, ముంబై- ఖరగ్‌పూర్ కారిడార్లు ప్రకటించారన్నారు.
పోర్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలకు కనెక్టివిటీ పెరుగుతుందని, 1996లో నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గానికి స్థలం కేటాయించామని, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టిందని అన్నారు. ఇన్ని సంవత్సరాలు నత్తనడకన నడిచిన ఈ ప్రాజెక్టును సురేష్ ప్రభు ఫాస్ట్ ట్రాక్‌లో పూర్తి చేశారని కొనియాడారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications