కేసీఆర్ చిక్కాడు, గద్దె దిగినా ఆశ్చర్యం లేదు: బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ పైన పక్కా ఆధారాలు ఉన్నాయని, కేసీఆర్ గద్దె దిగాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం కేబినెట్ సమావేశంలో అన్నారు.
నోటుకు ఓటు వ్యవహారంలో కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు.
బుధవారం గవర్నర్‌కు కేసీఆర్ చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గద్దె దిగాల్సి వచ్చినా రావొచ్చన్నారు.

కేబినెట్ మీటింగ్
ఫోన్ ట్యాపింగ్ అంశం బుధవారం ఏపీ కేబినెట్‌ను కుదిపేసింది. ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం నేతలకు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయడం, మరికొందరిని కేసులో ప్రశ్నించనున్నారన్న సమాచారంతో దాదాపు ఆరున్నర గంటలపాటు సాగిన భేటీలో నాలుగ్గంటలకు పైగా ఈ అంశంపైనే చర్చించారు.

ఏపీ సచివాలయం వద్ద తనిఖీ
తెలంగాణ సర్కార్ ఏ చట్టం ప్రకారం ముందుకువెళ్తే అదే చట్టం ప్రకారం తమకూ కేసులు నమోదు చేసి ముందుకు పోయేందుకు వీలుంటుందని చంద్రబాబు పేర్కొన్నట్టు సమాచారం. ఈ కేసును పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్న ఈసీ లేఖపైనా కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిగింది.

బాబు నివాసం వద్ద పోలీసులు
ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌కు సర్వ హక్కులు ఉంటాయని, పోరాడి సాధించుకోవాలే తప్ప తెలంగాణ బెదిరింపులకు భయపడనక్కర్లేదని, ఇంకా సమయం మించిపోలేదని, మంచి తరుణం ముందుందని సిఎం వ్యాఖ్యానించారని తెలిసింది.

బాబు నివాసం వద్ద పోలీసులు
కేసీఆర్ కూడా చిక్కారని, ఆయన చేసిన తప్పుల నుండి తప్పించుకోలేరని చంద్రబాబు పేర్కొన్నట్టు తెలిసింది. కేసులకు భయపడనక్కర్లేదని, చివరి వరకూ పోరాడి తాడో పేడో తేల్చుకుందామన్నారు.

బాబు నివాసం వద్ద పోలీసులు, సీసీ కెమెరాలు
అన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపుతోందని ఒకరిద్దరు మంత్రులు ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. కెసిఆర్ ప్రభుత్వం ఆడుతున్న మైండ్‌గేమ్‌ను అడ్డుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications