ఆయన లేకుండానా: గవర్నర్‌కు బాబు కౌంటర్!, అమరావతిలో టైమ్ క్యాప్యూల్స్

న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం పైన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినట్లు చంద్రబాబు విలేకరులతో ఢిల్లీలో చెప్పారు.

అదే సమయంలో, ఏపీ భవన్‌లో బస చేసిన గవర్నర్ నరసింహన్‌ను కూడా చంద్రబాబు కలిశారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించామని, ఆయన లేకుండా శంకుస్థాపన ఎలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.

అంతకుముందు, గవర్నర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తే రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తానని అన్నారు.

హైదరాబాదులో తన బాధ్యతలను గవర్నర్ సరిగా నిర్వహించడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు, చంద్రబాబు ప్రతిస్పందన ఆసక్తిని రేపింది.

Chandrababu Naidu invites Governor Narasimhan to Amaravati foundation

కేంద్ర రక్షణమంత్రితో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌తో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు.

బాబు ప్రయోజనాల కోసమే: రఘువీరా రెడ్డి

చంద్రబాబు తన ప్రయోజనాల కోసమే చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయం అంటున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. మడకశిరలో తాగునీరు లేకే జలవివాదాలు వస్తున్నాయన్నారు. హంద్రీనీవాను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

శంకుస్థాపనకు భారీగ ఏర్పాట్లు

అమరావతి శంకుస్థాపనను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు హాజరవుతుండటంతో కట్టుదిట్టమైన భదత్రా ఏర్పాట్లు చేస్తోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించనున్నారు.

ఈ నెల 22న జరిగే రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రకటించింది. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది. పలు శాఖల అధికారులు సోమవారం శంకుస్థాపన ప్రాంతంలో, అనంతరం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో పురపాలక శాఖమంత్రి పి నారాయణ, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సమక్షంలో శంకుస్థాపన నిర్వాహక కమిటీ సమావేశం జరిగింది.

శంకుస్థాపన స్థలానికి వివిధ జిల్లాల నుంచి కాలినడకన క్రీడా జ్యోతులు తీసుకురానున్నామని మంత్రి నారాయణ చెప్పారు. విభజన, ఆందోళనలు, చట్టసభల్లో చర్చలు, రాజధానికి భూసమీకరణ, నిర్మాణం తదితర అంశాలను సూచిస్తూ కాలనాళిక (టైమ్‌ క్యాప్సూల్) ఏర్పాటు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+