రాజధాని తప్పనిసరి అయింది: బాబు, జపాన్ కంపెనీ డిజైన్ ఓకే చేశారు
విజయవాడ: రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రకు రాజధాని నిర్మాణం తప్పనిసరి అయిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు శుక్రవారం అన్నారు. ప్రజా రాజధానికా అమరావతి నిర్మాణం అన్నారు. రైతులు స్వచ్చంధంగా 34వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారని చెప్పారు. అంతర్జాతీయ హంగులతో ప్రజా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు.
చంద్రబాబు రాజధాని నగర భవన నిర్మాణాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణంపై మూడు అంతర్జాతీయ సంస్థలు డిజైన్లు సమర్పించాయన్నారు. వాటిలో జపాన్‌కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ డిజైన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

అమరావతిలో ప్రభుత్వ భవనాలు ఎలా ఉండాలన్న దాని పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశం నిర్వహించారు. గేట్ వే హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సిఆర్డీఏ అధికారులు, అంతర్జాతీయ వాస్తుశిల్పిలు హాజరయ్యారు.
సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టుతో పాటు పలు ముఖ్యమైన ప్రభుత్వ భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే విషయమై గతంలో ప్రభుత్వం ఎంట్రీలు ఆహ్వానించింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ రిచర్డ్ రోజెస్, జపాన్‌కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్, భారత్‌కు చెందిన డీవీ జ్యోషి డిజైన్లను సీఆర్డీఏకు అందించాయి. చంద్రబాబు అంతకుముందు తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications