గోదావరి పుష్కరాల లోగోతో బాబు, ప్రధానికి ఆహ్వానం
అమరావతి: గోదావరి పుష్కరాలకు సంబంధించిన అధికారిక లోగోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు గోదావరి పుష్కరాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
నిధుల కోసం వెనుకంజవేయకుండా యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. గోదావరి తీరంలో పుష్కరాలు కనువినీ ఎరుగని రీతిలో నిర్వహించడం ద్వారా సంస్కృతి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామన్నారు. విభిన్న కార్యక్రమాలతో పుష్కరాల నిర్వహణ సాగుతుందని తెలిపారు.
అనంతరం ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సచివాలయంలో మాట్లాడుతూ దాదాపు 198 లోగో నమూనాలు తయారు చేశారని, చివరకు శ్రేష్టా కమ్యునికేషన్స్ సంస్థ రూపొందించిన లోగోను ఖరారు చేసినట్టు తెలిపారు. గోదావరి నదీ ప్రవాహానికి, ఆరని జ్యోతికి ప్రతీకలుగా లోగోను తయారు చేశారని చెప్పారు.

ఇక నుంచి ప్రభుత్వ అధికారిక, ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ లెటర్‌హెడ్‌లపై ఈ లోగో గుర్తు ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలకుఆహ్వానం పంపనున్నట్టు తెలిపారు. పుష్కరాల పర్యవేక్షణకు ధనుంజయరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ తదితర ముఖ్యమైన శాఖల పనులు పూర్తయ్యాయని అన్నారు. దేశవ్యాప్తంగా మూడు నుంచి నాలుగు కోట్ల మంది హాజరుకావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు రూ. 1471 కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో రూ. 100 కోట్లు కేంద్రం ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాధరెడ్డి, సీఎస్ ఐవీఆర్ కృష్ణారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications