వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిలిచారు కదా అని, రచ్చ చేస్తామంటే అంగీకరిస్తామా?: రోజాపై బాబు ఆగ్రహం

ఏపీలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వైసిపి ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అరెస్ట్ చేశారన్న ఆరోపణల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తీవ్రంగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వైసిపి ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అరెస్ట్ చేశారన్న ఆరోపణల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తీవ్రంగా స్పందించారు.

ఆహ్వానం ఉందని, మహిళా సదస్సుకు వచ్చి రచ్చ చేస్తామంటే పోలీసులు అంగీకరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులమతాలు రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా ఉంటామన్నారు. ప్రతి వారం కోర్టుకు వెళ్లేవారు సుద్దులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ మహిళల పైన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు.

'రోజా ఫోన్లో కెమెరా ఆన్ చేస్తుంటే.. కిడ్నాప్, చంద్రబాబుకు భయమెందుకు''రోజా ఫోన్లో కెమెరా ఆన్ చేస్తుంటే.. కిడ్నాప్, చంద్రబాబుకు భయమెందుకు'

అమరావతిలో మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. దేశంలో ఈ తరహా సదస్సు నిర్వహణ ఇదే తొలిసారి అని చెప్పారు. తరతరాలుగా వస్తున్న లింగ వివక్షను రూపుమాపేందుకు, మూడు రోజుల సదస్సులో విశ్వాసం కల్పించామన్నారు.

మహిళల సమస్యలన్నింటికి పరిష్కార ంచెప్పే దిశగా జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహించామన్నారు. సోషల్ మీడియాలో సదస్సుకు మంచి స్పందన వచ్చిందని, మహిళా పార్లమెంటు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

 Chandrababu Naidu responds on Roja's arrest issue

ప్రతి వ్యక్తి తోబుట్టువులను, భార్యను గౌరవించాలన్నారు. ఇకపై ప్రతి ఏడాది మహిళా పార్లమెంటును నిర్వహించేందుకు వేరే రాష్ట్రాలు ముందుకు రాకపోతే మళ్లీ అమరావతిలోనే నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రంలో నాలుగు అతిపెద్ద ఈవెట్లు నిర్వహించామని, రెండు పుష్కరాలు నిర్వహించామన్నారు. ఇంటలెక్చువల్స్, విదేశీ ప్రముఖులు వచ్చారన్నారు. వటన్నింటికంటే తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది మహిళా సదస్సే అన్నారు.

'కడివెడు విషంలో చిటికెడు పాలు కలిపేందుకు వెళ్తే.. రోజా కన్నీటితో పన్నీటి జల్లు' 'కడివెడు విషంలో చిటికెడు పాలు కలిపేందుకు వెళ్తే.. రోజా కన్నీటితో పన్నీటి జల్లు'

సోషల్ మీడియాలో కూడా ఈ సదస్సుకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. మహిళలకు ఇప్పటికీ సముచిత స్థానం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళళ భాగస్వామ్యం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఊహించినదాని కంటే ఎక్కువగా మహిళలు వచ్చారన్నారు. పదివేల మంది వస్తారనుకుంటే 22వేల మంది వచ్చారన్నారు.

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu on Monday responded on YSR Congress Party MLA Roja's arrest issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X