అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా?

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కోరితే ప్రభుత్వం కోసం పరిశ్రమ తరఫున ఏదైనా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అలాగే ఈ అవార్డుల ప్రదానం చూసి పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు స్ఫూర్తి పొందాలని, కళాకారులు ఎక్కడ బాగుంటే అక్కడ ఆ భూమి, ఆ ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా కళకళలాడుతుంటుందని, దీన్ని గుర్తించి రేవంత్ రెడ్డి అవార్డులనిచ్చారంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇదే క్రమంలో తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని కూడా చిరంజీవి మర్చిపోయి.. పక్క రాష్ట్రం అంటూ మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో చిరంజీవి విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు.

నెటిజన్ల కామెంట్లలో ఆగ్రహం

ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు కూడా అవార్డులనిస్తే బాగుంటుందని, కళాకారులను ఉత్సాహపరచడంలో పక్క రాష్ట్రం కొంత వెనకంజలో ఉందన్నారు. వారు కూడా ప్రోత్సహిస్తే ఏపీకి ఆదాయం కూడా వస్తుందని సూచన చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, సినీ పరిశ్రమకు చాలా సన్నిహితంగా, దగ్గరగా ఉంటారని, ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ను పక్క రాష్ట్రం అని సంభోదించడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లలో సినీ పరిశ్రమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాన్ని వదిలిపెట్టి, అప్పుడు ఏమాత్రం సహకరించని ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా సీనియర్ రాజకీయవేత్త అయిన చంద్రబాబుకు కూడా చిరంజీవి సలహాలిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Gaddar Awards Megastar Chiranjeevi Taught AP Chief Minister Chandrababu Naidu a Lesson

పాప్ కార్న్ కన్నా తక్కువే ఉన్నాయి

మరికొందరు నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీని కాపాడుకోవడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఉన్నారని, ఇప్పుడు నీ సలహాలు అవసరంలేదని, ఏపీలో సినిమాలు తీసుకొని, ఏపీలో ఆదాయం వస్తుంటే మీరంతా హైదరాబాద్ లో ఆస్తులు కొనుక్కొని, ఆ రాష్ట్రానికి పన్నులు కడుతున్నారని, అటువంటప్పుడు సినీ పరిశ్రమను ఏపీలో ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాలను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో గుర్తులేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. సినిమా థియేటర్లలోని క్యాంటిన్లలో అమ్మే పాప్ కార్న్ ధరకన్నా టికెట్ ధరలు తక్కువగా ఉండేవని, అటువంటి సమయంలో ధరలు పెంచడానికి వెళ్లిన మీకు జరిగిన అవమానం గుర్తుకులేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+