కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. లోకేష్ - బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకొని వీరంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సీఎం కుటుంబానికి గాయత్రి నిలయంలో ప్రత్యేక స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో సహా పలువురు ఉన్నతాధికారులు వారిని ఆహ్వానించారు.
రేపు శ్రీవారి దర్శనం..
ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రత్యేక వసతుల్లోకి వెళ్లింది. వీరంతా ఈరోజు రాత్రి తిరుమలలోనే బస చేయనుండగా.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య దర్శనం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దేవాన్ష్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారి ఆశీస్సులు పొందనున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవాన్ష్ పుట్టినరోజును ఆధ్యాత్మికంగా జరుపుకోనున్నారు.

భద్రత కట్టుదిట్టం..
ప్రముఖుల రాకతో తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్, క్యూలైన్ నిర్వహణలో మార్పులు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
మరోవైపు తిరుమలకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కొంతమంది భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నట్లు సమాచారం. తిరుమలలో భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రతి ముఖ్య సందర్భంలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడం చంద్రబాబు కుటుంబానికి సాంప్రదాయంగా మారింది. ముఖ్యంగా కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు వంటి సందర్భాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
— Telugu Desam Party (@JaiTDP) March 20, 2026
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications