స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే 'క ', కే ర్యాంప్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఓవైపు హీరోగా మార్కెట్ పెంచుకుంటూనే.. మరోవైపు నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే కిరణ్ ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ.. ఈ యంగ్ హీరో తన ఓటీటీ డెబ్యూపై అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా "గువ్వల చెరువు ఘాట్" అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సిరీస్ కి 'డియర్ కామ్రేడ్' ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. డ్రీమ్ ఫార్మర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మించారు. మలయాళం బ్యూటీ సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా.. తిరువీర్, తేజస్వి రావ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

kiran-abbavaram-and-samyuktha-menon-web-series-guvvala-cheruvu-ghat-on-amazon-prime-videos-teaser-re

కాగా ఉగాది పండగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలను షేర్ చేసుకున్నారు. ''ఈ కంటెంట్ ఏ పొద్దు బయటకి వస్తాదో తెలీదు కానీ, వచ్చిన రోజు మాత్రం మీరందరూ గర్వంగా ఫీల్ అవుతారు'' అని కిరణ్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా టీజర్ ని పంచుకున్నారు. దండం పెట్టుకొని మరీ గొంతు కోసే సీన్ చూస్తేనే ఇందులో ఎలాంటి వైలెంట్ కంటెంట్ ఉంటుందనేది అర్థమవుతోంది.

అలానే కిరణ్ అబ్బవరం ఫోటోగ్రాఫర్ గా కనిపించనుండగా.. చివర్లో రాయలసీమ యాసలో ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తంగా ఈ సిరీస్ రాయలసీమ రూరల్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+