కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !!

ప్రపంచ వ్యాప్తంగా రంజాన్‌ మాసం ఉపవాస దీక్షలు ముగిశాయి. కాగా ఇవాళ భారత్‌లో నెలవంక కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) పండగ జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు ఆ పోస్టులో పవిత్ర రంజాన్ ( ramzan ) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశమని తెలిపారు.

the-crescent-moon-has-been-sighted-in-india-and-time-for-celebrate-ramzan-across-the-country

అంతే కాకుండా పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందని కొనియాడారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ.... ఈద్ ముబారక్" అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న సాధారణ సెలవు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తొలుత జారీ చేసిన సాధారణ సెలవుల జాబితా ప్రకారం 20వ తేదీన రంజాన్‌ సెలవుగా నిర్ణయించారు. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్‌ ( ramzan ) పండగ శనివారం వస్తుందని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈఓ నుంచి ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో 21వ తేదీ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+