చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు సుడిగాలి పర్యటన, కఠిన చర్యలు తప్పవు: కేఈ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నల పంటలపై ఏరియల్ సర్వే చేసిన ఆయన మధ్యాన్నానికి కడపజిల్లా రైల్వేకోడూరుకు చేరుకున్నారు.

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరులో మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం కోల్డ్‌స్టోరేజీలు, నష్టపోయిన ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం ఇస్తామన్నారు.

నష్టపరిహారంతో పాటు అదనంగా ఇన్సూరెన్స్‌ పాలసీ కేటాయిస్తామన్నారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో త్వరలోనే 5వేల కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఓబులవారిపల్లె మండలం పి.కమ్మపల్లెలో దెబ్బతిన్న పంటలను సైతం పరిశీలించారు.

chandrababu naidu visiting rain villages in kadapa

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. 23వేల మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. భారీ వర్షాల కారణంగా కడప జిల్లా రైతులకు తీవ్రంగా నష్టపోయారు.

కమలాపురంలో వరిపంట పూర్తిగా నీట మునిగింది. రైల్వే కోడూరు, రాజంపేటలో భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ.260 కోట్ల నష్టం జరిగిందని అధికారులు నివేదిక పంపారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఆరూరులో చెరువుకట్ట తెగి 2వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

"మీ ఇంటికి మీ భూమి" కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలివిడతలో భాగంగా వచ్చిన తొమ్మిద లక్షల ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.

ఫిర్యాదుల పరిష్కారానికి ఉన్నతాధికారులతో కమిటీలు వేశామన్నారు. డిసెంబర్ 31లోగా ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఫిర్యాదులపై అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూమి రికార్డుల ప్రక్షాళన కోసమే " మీ ఇంటికి - మీ భూమి" కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు.

English summary
Andhra Pradesh Cheif minister chandrababu naidu visiting rain villages in kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X