కేంద్రంతో రాజీలేదు: వెంకయ్యకు బాాబు థ్యాంక్స్, రైల్వే జోన్‌పై త్వరలో ప్రకటన

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల ఎపి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంతో సామరస్యంగా ఉండడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చని తేటతెల్లమైందన్నారు.

ఆంద్రప్రదేశ్ కు రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళన సాగుతున్న సమయంలో హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం వల్లే ప్రయోజనమని కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చింది.

అయితే ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రయోజనం ఉండదని ప్రత్యేక హోదా ఇవ్వాలని విపక్షాలు ఎపిలో ఆందోళనలు సాగించాయి.అంతేకాదు అధికార పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకుగాను ఈ అంశాన్ని ప్రయత్నించాయి.

అయితే కేంద్రంలో టిడిపి భాగస్వామిగా ఉంది.అయితే ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసినందున ఎన్ డి ఎ నుండి వైదొలగాలని టిడిపిపై విపక్షాలు ఒత్తిడి తెచ్చాయి.

ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీతో

ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీతో

తమ కూటమిని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు బిజెపి, టిడిపి ప్రచారం చేశాయి. స్వయంగా మోడీ, చంద్రబాబునాయుడులు ఈ అంశాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించారు.

అయితే కేంద్రంలో ఎన్ డి ఎ ప్రభుత్వం ఏర్పాటైంది.అయితే ప్రత్యేక హోదా అంశం ఎన్ డి ఎకు ఇబ్బందికరంగా మారింది. దరిమిలా ప్రత్యేక ప్యాకేజీని ఎపికి ఇచ్చింది.అయితే ఈ ప్యాకేజీపై కూడ విపక్షాలు పెదవివిరిచాయి.

అయితే ఈ ప్యాకేజీకి బుదవారం నాడు జరిగిన కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.అయితే ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్రత్యేక ప్యాకేజీతో వస్తాయని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.కేంద్రం కూడ ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపినందున ఇబ్బందులు తొలగినట్టేనని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించిన బాబు

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించిన బాబు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.కేంద్రం తీసుకొన్న నిర్ణయం పట్ల ఎపి సిఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలకు రాజకీయలు తప్ప అభివృద్ది పట్టదని ఆయన విమర్శించారు. కేంద్రంతో ఘర్షణపడితే ప్రయోజనం ఉండదు. సామరస్యంగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చని నిరూపితమైందన్నారాయన.పోలవరం ప్రాజెక్టు ఖర్చును వందశాతం కేంద్రమే భరించాలని నిర్ణయం తీసుకొంది.

వెంకయ్యకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపిన బాబు

వెంకయ్యకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపిన బాబు


ఎపికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలపడంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు బుదవారం నాడు రాత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలని, అభివృద్దికి సహకరించాలని ఆయన కోరారు.ఈ మేరకు ప్రధానమంత్రి మోడీకి, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడుకు , అరుణ్ జైట్లీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు

.కేంద్రంతో ఏనాడు రాజీపడలేదని బాబు చెప్పారు.విపక్షాలు తల తోకలేని విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

రైల్వేజోన్ పై త్వరలోనే ప్రకటన

రైల్వేజోన్ పై త్వరలోనే ప్రకటన


విశాఖ రైల్వే జోన్ అంశంపై త్వరలోనే కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర మంత్రి సుజానా చౌదరి చెప్పారు. కేంద్రమంత్రివర్గం ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎపికి దక్కాల్సిన నిధుల విషయంలో రాజీ పడడం లేదన్నారు. కేంద్రం కూడ ఎపి విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడ త్వరలోనే కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.

ఆంద్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం సహకారం

ఆంద్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం సహకారం

ఆంద్రప్రదేశ్ అభివృద్ది కోసం కేంద్రం సానుకూలంగా దృష్టిని కేంద్రీకరించిందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ విషయమై ప్రధానమంత్రి మోడీ, బిజెపి చీప్ అమిత్ షా పలుమార్లు చర్చించామన్నారు.ఎపికి అన్ని రకాలుగా కేంద్రం నుండి సహయాన్ని అందిస్తామని ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
andhra pradesh chief minister chandrababu naidu welcomed union cabinet approval on special package .chandra babu telephoned to union minister venkaiahnaidu thanked for approval union cabinet special package.
Please Wait while comments are loading...