ఏపీలో ఆ పథకంపై చంద్రబాబు శుభవార్త.. ఈసారి రూ.2వేల విలువైన వస్తువులు ఫ్రీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. వారి అభ్యున్నతికి దోహదం చేస్తుంది. ఇక ఇదే సమయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గర్భిణీ స్త్రీలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం.

ఏపీలో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం
బాలింతలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం మళ్లీ ఏపీలో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవమైన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్ ను అందించాలని నిర్ణయించింది. 2014లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది. అయితే గత వైసిపి పాలనలో ఈ పథకాన్ని వైసిపి ప్రభుత్వం నిలిపివేసింది.

Chandrababu Naidu will relaunch the NTR baby kit scheme in AP This time items worth Rs 2 000 will be free

Take a Poll

వైసీపీ హయాంలో నిలిచిన పథకం పునః ప్రారంభం
మళ్లీ 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిలిచిపోయిన ఈ పథకాన్ని మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ పథకం కోసం 51. 14 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన తల్లులకు శిశు ఆరోగ్య సంరక్షణ కోసం కిట్లను అందిస్తారు.

ఎన్టీఆర్ బేబీ కిట్ లో 13 వస్తువులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గతంలో ఎన్టీఆర్ బేబీ కిట్ లో 11 వస్తువులు ఉండగా ఈసారి 13 వస్తువులను చేర్చారు. గతంలో కూటమి ప్రభుత్వం అందించిన బేబీ కిట్ లో 1410 రూపాయల విలువైన వస్తువులను అందజేసేవారు. అందులో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెడ్, యాంటీ సెప్టిక్ లోషన్ తో పాటు, నాప్కిన్, డైపర్లు షాంపూ వంటి 11 రకాల సామాను ఉండేది.

రెండు వేలకు చేరిన ఎన్టీఆర్ బేబీ కిట్ ధర
ప్రస్తుతం వీటితో పాటు ఫోల్డబుల్ బెడ్, బ్యాగ్ కిట్ కు ప్రభుత్వం యాడ్ చేసింది.దీంతో ఎన్టీఆర్ బేబీ కిట్ లో 13 వస్తువులు చేరాయి. రెండు వస్తువుల అదనంగా చేర్చడంతో 450 భారం పెరిగింది మొత్తం ఈ కిట్ ధర 1954 రూపాయలు అవుతుంది. మొత్తం ప్రతి సంవత్సరం ఈ పథకం ద్వారా సుమారు 3.20 లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

త్వరలోనే ఈ పథకం అమలు
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఈ కిట్లను పరిశీలించి కొత్త వస్తువులను చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త వస్తువుల చేర్పు కారణంగా మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులు అందిన వెంటనే కొత్త టెండర్లను పిలుస్తా.రు టెండర్లు ఖరారు అయిన తర్వాత ఎన్టీఆర్ బేబీ కిట్ ను ప్రభుత్వం అందించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+