ఇక తాడోపేడో, మార్చి 5న బాబు కీలక నిర్ణయం: పత్తిపాటి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రత్యేక హోదాకు తగ్గట్టుగా ప్యాకేజీ ప్రకటించకపోతే మార్చి 5న చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఏపీకి కేంద్రం నుండి నిధుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పుల్లారావు స్పష్టం చేశారు.

జగన్‌కు కౌంటర్: మార్చి 5నే టిడిపి ఎంపీల రాజీనామా, బిజెపితో కటీఫ్: ఆది

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు జనం రావడం కారణంగానే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానని డ్రామాలు మొదలు పెట్టారని పుల్లారావు చెప్పారు.

ఏపీ రాష్ట్రానికి నిధుల విషయమై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్టీలు నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీలో ఆందోళన బాట పట్టాయి.

టిడిపిVsబిజెపి: నిధుల విడుదలపై చర్చకు రెఢీ: సోము వీర్రాజు, శ్వేత పత్రం ఇవ్వండన్న బాబు

బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి కూడ కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్‌‌లోపల కూడ ఆందోళనకు దిగింది.బిజెపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.ఈ తరుణంలో మంత్రి పుల్లారావు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకొంది.

మార్చి5న, తాడోపేడో

మార్చి5న, తాడోపేడో

మార్చి5వ, తేదిన కేంద్రంతో తాడోపేడో తేల్చుకొంటామని ఏపీ మంత్రి పుల్లారావు ప్రకటించారు.ప్రత్యేక హోదాకు తగ్గట్టుగా ప్యాకేజీ ప్రకటించకపోతే మార్చి 5న చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం హమీ ఇచ్చిన విషయాన్ని పుల్లారావు గుర్తు చేశారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు జనం రాకపోవడంతో ఎంపీల రాజీనామా డ్రామాను తెరమీదికి తెచ్చారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ఎన్నోసార్లు చెప్పారని, కానీ ఒక్కసారి కూడా చేయలేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఇక విజయసాయిరెడ్డి అయితే రాజీనామాపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని, చెప్పారు. మోదీతో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు.

వెబ్‌సైట్లో జగన్‌కు కావాల్సిన సమాచారం

వెబ్‌సైట్లో జగన్‌కు కావాల్సిన సమాచారం

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధుల వివరాలన్నీ శాఖల ప్రకారం వెబ్‌సైట్‌లో పెట్టామని చెప్పారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. పవన్ కళ్యాణ్‌కు కావాల్సిన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌ నుండి తీసుకోవచ్చన్నారు పుల్లారావు.రాష్ట్రానికి ఇచ్చిన హమీ మేరకు నిధులను విడుదల చేయలేదని పుల్లారావు అభిప్రాయపడ్డారు.

దమ్ముంటే ఇప్పుడే రాజీనామాలు చేయాలి

దమ్ముంటే ఇప్పుడే రాజీనామాలు చేయాలి

వైసీపీకి దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామాల చేయించాలని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు..ప్రత్యేక హోదా విషయమై జగన్ కపట నాటకాలు ఆడుతున్నాడని రాజప్ప విమర్శించారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

ఎత్తులకు పై ఎత్తులు

ఎత్తులకు పై ఎత్తులు


ఏపీలో ఒకరిపై మరోక పార్టీ పై చేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామాల చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే మార్చి5వ, తేదినే టిడిపి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు. అయితే బిజెపితో తెగతెంపులు చేసుకొంటే రాజకీయంగా ఎవరికీ ప్రయోజనాలు కలుగుతాయనే అంశంపై కూడ టిడిపి చర్చిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap minister Pattipati Pullarao said that Chandrababu naidu will take key decission on March 5. He spoke to media on Thursday. If union government not fulfilled its promises Chandrabu naidu will take key decission he said

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి