చంద్రబాబు కేక్ కట్ చేసి గవర్నర్‌తో తినిపించారు
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో కేక్ కట్ చేయించి, తినిపించారు. శుక్రవారం నరసింహన్ 70వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
చంద్రబాబు నరసింహన్ కోసం ప్రత్యేకంగా ఈ కేక్‌ను రాజ్‌భవన్‌కు తీసుకెళ్లారు. అనంతరం నరసింహన్‌తో భేటీ అయిన చంద్రబాబు అరగంట సేపు చర్చలు జరిపారు. ముఖ్యంగా తెలంగాణకు సచివాలయ భవనాల అప్పగింతపై చర్చించారు. మరోవైపు నరసింహన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications