34 ఏళ్ళ వయస్సులో కూడ బాబు స్పీడ్ ను అందుకోలేకపోతున్నా: లోకేష్

దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నంతా స్పీడుగా పనిచేయడం లేదని ఏపీ పంచాయితీరాజ్ , ఐటీ శాఖ మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.

చిత్తూరు: దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నంతా స్పీడుగా పనిచేయడం లేదని ఏపీ పంచాయితీరాజ్ , ఐటీ శాఖ మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.

గురువారం నాడు ఆయన చిత్తూరు జిల్లాలో సెల్ కాన్ కంపెనీ యూనిట్ ను రేణిగుంటలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ కూడ పాల్గొన్నారు.

 Chandrababu naidu works like a 20 years young man

67 ఏళ్ళ వయస్సులో కూడ 20 ఏళ్ళ యువకుడి తరహలోనే చంద్రబాబునాయుడు స్పీడుగా పనిచేస్తారని చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలను స్వీకరించి 80 రోజులైందన్నారు. తన వయస్సు 34 ఏళ్ళు అన్నారు.

అయినా తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పీడ్ ను అందుకోవడం లేదన్నారు. దేశంలో ఇంత స్పీడుగా పనిచేసే ముఖ్యమంత్రి లేరని లోకేష్ చెప్పారు. రానున్న రెండేళ్ళలో ఐటీలో లక్ష ఉద్యోగాలను తీసుకొని రానున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకురానున్నట్టు చెప్పారు.

రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రానికి ఆదాయం లేదన్నారు. అయినా ఏ మాత్రం అధైర్యపడకుండా ప్రభుత్వం అభివృద్దిని సాధిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+