శ్రీవారు తప్ప: బాబు, అదుపు తప్పిన ఎస్కార్ట్ వాహనం
చిత్తూరు/విశాఖ: చిత్తూరు జిల్లా తిరుమలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సోమవారం ఉదయం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తిరుమల నుండి తిరుపతి వెళ్తుండగా చంద్రబాబు ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పింది. అది ఓ కాలువలోకి దూసుకెళ్లింది. తిరుమల ఘాట్ రోడ్డులో ఇది జరిగింది. ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, చంద్రబాబు కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని, తిరుమలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని చెప్పారు. తిరుమలలో గత పదేళ్లుగా అవకతవకలు జరిగాయని, ఇకపై తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరేమీ లేకుండా చేస్తానని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టిటిడి అవకతవకల పైన స్పందించానని చెప్పారు. సీమాంధ్రను పునాదుల నుంచి నిర్మించాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఎక్కడ, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాననేది త్వరలో చెబుతానని తెలిపారు. తాను దేశం, రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నానని చెప్పారు.
బస్సు బోల్తా
విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications