వేచి చూడాల్సిందేనా?: లోకేష్‌కు మంత్రి పదవిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ గత కొద్ది రోజులుగా ఆ పార్టీ నేతలు, మంత్రులు తమ వాదనను వినిపిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పదవి ఇస్తే పార్టీతోపాటు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు వారసుడిగా లోకేష్ తన సత్తాను నిరూపించుకునే అవకాశం కూడా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, చంద్రబాబునాయుడు మాత్రం మరో స్పందించడం గమనార్హం. లోకేష్‌కు మంత్రి కట్టబెట్టడంపై సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'ఇప్పుడే కాదు... తర్వాత చూద్దాం' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Chandrababu on Lokesh's minister post

లోకేశ్ కోసం పదవి త్యాగం చేస్తామని పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. త్వరలోనే లోకేశ్‌కు మంత్రివర్గంలోకి ఎంట్రీ లభిస్తుందని అంతా భావించారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ విషయంపై కొంత స్పష్టత ఇచ్చారు.

మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ విషయంపై ఆలోచిద్దామన్న చంద్రబాబు.. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న ప్రశ్నకు ముసిముసిగా నవ్వుతూ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. అంటే.. మంత్రివర్గ విస్తరణ దాకా లోకేశ్ వేచి చూడక తప్పదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+