అలా ఉండండి: మంత్రులకు బాబు ఆదేశాలు
హైదరాబాద్: మంత్రులు అందరూ ఇక ముందు ప్రతి శనివారం మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు హైదరాబాదులోని లేక్‌వ్యూ అతిథి గృహంలో తనకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మిగిలిన సమయం సచివాలయంలో ఉండాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం ఆయన కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు.

కేజ్రీవాల్ గెలుపు శుభపరిణామంగా ప్రజలు భావిస్తున్నారని, దీనివల్ల కేంద్రవైఖరి మారుతుందని కూడా ప్రజలు భావిస్తున్నట్లు వారు ముఖ్యమంత్రితో అన్నారు. "మీరు ఒకవైపే చూస్తున్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. దేశానికి బలమైన నాయకత్వం వచ్చింది. పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. వృద్ధిరేటు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆ వాతావరణం దెబ్బతినకూడద"ని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, నేతలతో అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనతే అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రభుత్వఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇచ్చి చంద్రబాబు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
ఏపీలో సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు కింద గుర్తించి, వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారని సోమిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications