పోలీసు అమరవీరులకు చంద్రబాబు నివాళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. పోలీసులు చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు. పోలీసుల సంక్షేమానికి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే.. హోంగార్డుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు సంభవించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందేలా చర్యలు(జీవిత బీమా) తీసుకుంటామని చెప్పారు. విజయవాడలో శుక్రవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ఆయనతోపాటు.. గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప(హోంశాఖ), డీజీపీ సాంబశివరావు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications