కొత్త ఇంటికి భూమి పూజ చేసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి నిర్మాణం హైదరాబాదులో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఇల్లు జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 65లో ఉంది. గత నెలలో ఈ ఇంటి నిర్మాణం కోసం జూబ్లీహిల్స్ 24వ రోడ్డు నంబర్‌లో అద్దె ఇంటికి చంద్రబాబు మారారు.
ఆదివారం ఉదయం నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు భూమి పూజ చేశారు. నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నందు వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.

ఏడాదిన్నర కాలంలో ఈ ఇంటి నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 65లో ఉన్న ఇఁటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని గతంలోనే చంద్రాబబు నిర్ణయం తీసుకున్నారు.
ఆ కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 24లో గల అద్దె ఇంట్లో ఉంటారు.












Click it and Unblock the Notifications