న్యాయాన్ని ఓడించడానికి చంద్రబాబు ప్లాన్లు: వైసీపీ ఎంపీ సాయిరెడ్డి

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు జైలు నుండి బయటకు రావాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్నా కోర్టులలో చంద్రబాబుకు చుక్కెదురు అవుతుంది. చంద్రబాబు ఏ కోర్టుకు వెళ్ళినా ఆయనకు షాక్ తగులుతుంది.

చంద్రబాబు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా బెయిల్ దొరుకుతుందని మొదట భావించారు. కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. దీంతో చంద్రబాబు సుప్రీం మెట్లు కూడా ఎక్కారు. ఇక తాజా పరిస్థితులపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. కోర్టులలో చంద్రబాబు పిటీషన్ లను ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు .

Chandrababu plans to defeat judiciary system: YCP MP VijayaSai Reddy

ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు చంద్రబాబు గారి ప్లీడర్లు అంటూ పేర్కొన్న ఆయన, వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి అంటూ చంద్రబాబు పరిస్థితిని వివరించారు . ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం ఉందని చంద్రబాబు లాయర్ల తీరుపై ఎద్దేవా చేశారు.

పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు అంటూ చంద్రబాబు కేసులు కోర్టులకు కూడా పెద్ద తలనొప్పి అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉందని సాయిరెడ్డి పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతేకదా? అంటూ టీడీపీ చేపట్టిన ఆందోళనలను ఎద్దేవా చేశారు.

మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు? వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా? అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిని సైతం టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+