విశాఖ ప్రజలు దైర్యం చూపారు: చంద్రబాబు
విశాఖపట్నం: విపత్తులోనూ విశాఖపట్నం ప్రజలు ధైర్యంగా నిలబడ్డారని, ప్రకృతికి ఎదురొడ్డి నిలబడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనన్ారు. విశాఖ ఎంవిపీ కాలనీలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తన జీవితంలో ప్రజలు అందించిన సహకారాన్ని మరిచిపోలేనని ఆయన అన్నారు. హుధుద్ తుఫాను తర్వాత 35 రోజుల్లో చాలా సమస్యలను అధిగమించామని ఆయన చెపపారు .
విశాఖపట్నం నగరాన్ని మళ్లీ సుందరనగరంగా తీర్చి దిద్దే బాధ్యత తనదేనని ఆయన అన్నారు విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా, పరిశ్రమల హబ్‌గా మారుస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటారని ఆయన అన్నారు.

మొక్కలు నాటిని తర్వాత విశాఖ వాసులతో హరిత ప్రతిజ్ఞను చేయించారు. తమ నగరాన్ని హరిత విశాఖగా తయారు చేయడంలో భాగస్వాములమవుతామని, ప్రతీ ఇంటికీ ఒక మొక్కను నాటి దాన్ని పరిరక్షించనున్నట్లు ప్రతిజ్ఞ చేయించారు. అలాగే విశాఖ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చదిద్దుకుంటామని, వారానికి రెండు గంటల సమయాన్ని స్వచ్ఛ హరిత విశాఖకు కేటాయిస్తామని విశాఖ ప్రజల చేత చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం నగరంలో ఎక్కడ మొక్కలు నాటారో తెలుసుకునే విధంగారూపొందించిన జియోటాగ్ సాఫ్ట్‌వేర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ రోజు విశాఖలో 79వేల చెట్లను నాటుతున్నామన్నారు. విశాఖలో పచ్చదనం ఎంత ఉందనేది తెలుసుకునేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అనంతరం భారతీయ కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో రైతులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications