ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరు టీడీపీ "ఇదేం ఖర్మ"లో చంద్రబాబు-వివేకా హత్యపై నోరువిప్పండి-అభద్రతాభావంలో జనం !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చంద్రబాబు ఏలూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల్ని చంద్రబాబు ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వివేకా హత్యపై ఇచ్చిన తీర్పుతో పాటు పోలవరంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ బాదుడే బాదుడుపై ప్రజల్లో చైతన్యం రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 ఏలూరులో ఇదేం ఖర్మ కార్యక్రమం

ఏలూరులో ఇదేం ఖర్మ కార్యక్రమం

ఏలూరులో టీడీపీ ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రంలో బాదుడే బాదుడు కార్యక్రమం సాగుతోందని చంద్రబాబు తెలిపారు. అన్ని ధరలు పెరిగిపోయాయని, జే బ్రాండ్ మద్యం తానే ఉత్పత్తి చేసి పంపిస్తున్నానని సీఎం జగన్ స్వయంగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆహార ధాన్యాలతో పాటు అన్నిధరలు పెరిగిపోయాయన్నారు. అయినా ప్రభుత్వం సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. తాము అనుకుంటే మొద్దుశీను నన్ను చంపేసేవాడని బెదిరిస్తున్నారన్నారు. అమాయకుల్ని అరెస్టు చేసి చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ పేర్లు చెప్పమంటున్నారన్నారు. చింతమనేని ప్రభాకర్ మీద 29 కేసులు పెట్టారని, ఇందులో 15 అట్రాసిటీ కేసులు పెట్టి ఏం పీకారన్నారు. నీకు పోలీసులుంటే నాకు ప్రజలున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.

 వివేకా హత్యపై మౌనమెందుకు

వివేకా హత్యపై మౌనమెందుకు

సుప్రీంకోర్టు వివేకానందరెడ్డి హత్య చాలా ఘోరంగా జరిగిందని చెప్పిందని చంద్రబాబు గుర్తుచేశారు. వివేకా హత్య జరిగితే తనపై అన్ని ఆరోపణలు చేసిన జగన్... సీబీఐ విచారణ కోరారని, కానీ వివేకా కూతురు సునీత సీబీఐ విచారణ కోరితే వద్దన్నారన్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులు చనిపోయారని, సాక్ష్యులు యూటర్న్ తీసుకుంటున్నారని ఆరోపించారు. జగన్ పోలీసుల మెడపై కత్తిపెట్టి పనిచేయిస్తున్నారని, సీబీఐపై ఎదురుకేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వివేకా కేసును సునీత తెలంగాణకు బదిలీ చేయించడం సీఎంకు పెద్ద ఎదురుదెబ్బ అన్నారు. వివేకా హత్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమాధానం చెప్పలేకపోతే జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

 ఇదే మీకు లాస్ట్ ఛాన్స్

ఇదే మీకు లాస్ట్ ఛాన్స్

జగన్ వంటి ఉన్మాదులు గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరం ముంచేస్తాడని తాను ముందే చెప్పానని, కానీ మీరు నమ్మలేదని టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా వింటారని ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈసారి కూడా ఈ విషయం అర్ధం చేసుకోకపోతే ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అన్నారు. లాస్ట్ ఛాన్స్ తనకు కాదన్నారు. రాష్ట్రంలో చైతన్యంరావాలని, ధైర్యంగా ముందుకు రావాలని, భయపడితే లాభం లేదన్నారు. నెలకోసారి పోలవరం వచ్చానని, ప్రతీ సోమవారం పోలవరంగా మార్చానని, 72 శాతం పనులు పూర్తి చేశానని, సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజే రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టును రివర్ పాలు చేశాడని చంద్రబాబు విమర్శించారు. డబ్బుల కోసం కాంట్రాక్టర్ ను మార్చారని, బెదిరింపుల కోసం ఇంజనీర్ ను మార్చారని, పెద్ద వర్షం వస్తే గోదావరి నీళ్లు వచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. ఐదేళ్లలో 72 శాతం పూర్తయిన ప్రాజెక్టు.. మూడున్నరేళ్లలో గుండుసున్నా చేశారన్నారు. ఇదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అని, దాన్నీ నాశనం చేశారన్నారు. మొత్తం ప్రాజెక్టు నదిలో ముంచేసి తానే కారణమంటున్నారని, వీళ్లింట్లో భార్యాభర్తలు కాపురం చేయకపోయినా తానే కారణం అనేలా ఉన్నారన్నారు.

 విద్యాదీవెన కోతలపై

విద్యాదీవెన కోతలపై

తాను 15 లక్షల మందికి స్కాలర్ షిప్పులిస్తే ఇప్పుడు జగన్ 10 లక్షల మందికి ఇచ్చి 5 లక్షల మంది కోత పెట్టారని, ఇదేనా విద్యాదీవెన అని చంద్రబాబు ప్రశ్నించారు. మదనపల్లెలలో సీఎం జగన్ ఇలాంటి కార్యక్రమానికి డ్వాక్రా మహిళల్ని, ఇతర జనాల్ని తరలించారని ఎద్దేవా చేశారు. ఏలూరులో తన పర్యటనకు కూడా జనం రాకుండా అడ్డంకులు కల్పించారన్నారు. పోలవరం కుడి కాలువకు రైతుల నుంచి అభ్యంతరాలు వస్తే చింతమనేని ప్రభాకర్ వారితో మాట్లాడి ఒప్పించారన్నారు. కృష్ణాడెల్టాకు కూడా ఈ నీరు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేయాలని ప్రయత్నించినట్లు చంద్రబాబు తెలిపారు. పట్టిసీమలో 72 శాతం పూర్తి చేశామని, కానీ కొత్తగా వచ్చిన మంత్రికి డయాఫ్రమ్ వాల్ కూడా ఎక్కడుంటుందో తెలియదని అంబటి రాంబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాల్లో రెండు పంటలకు నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని, తన హయాంలో పోలవరం పూర్తి చేసి నీళ్లిద్దామని ప్రయత్నించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ జిల్లాల్లో ఆక్వారంగం ఎత్తిపోయిందని, రైతులందరూ నష్టపోయారన్నారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు జగన్ ఉరితాళ్లు వేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన మోటార్లకు మీటర్లు వేసే హక్కు జగన్ కు ఎవరిచ్చారన్నారు. పోలీసులు తమ సభల్లో కనిపిస్తే బదిలీలు చేసి బెదిరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తానే అనుకుంటే ఉంటే జగన్ ఇంటి నుంచి బయటికి వచ్చేవారా అని ప్రశ్నించారు. గతంలో తానూ విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు ఇచ్చానని, కానీ విద్యాదీవెన పేరుతో ఓ రోజు సాక్షికి యాడ్లు ఇచ్చేందుకు ఓ కార్యక్రమం పెడుతున్నారని జగన్ పై చంద్రబాబు విమర్శలు చేశారు.

 అభద్రతాభావంలో జనం ?

అభద్రతాభావంలో జనం ?

ఆడబిడ్డల ఖాతాల్లో డబ్బులు తిరిగి మద్యం అమ్మకాల ద్వారా తన ఖజానాలోకి తెప్పించుకుంటున్న తెలివైన వాడు జగన్ అని చంద్రబాబు అన్నారు. పిల్లలకు చదువు చెప్పాలన్న ఆలోచనే లేదని, మూడున్నరేళ్లలో ఎక్కడైనా ఓ టీచర్ ను రిక్రూట్ చేశారా అని ప్రశ్నించారు. ఆరు వేల స్కూళ్లు మూసేశారన్నారు. రైతుబిడ్డలు ఐటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. కానీ జగన్ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగం, మటన్ మార్ట్, ఫిష్ మార్ట్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఆస్పత్రుల్లో మందులు లేవని, ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో జనం అభద్రతాభావంతో బతుకుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాత్రి ఎవరు గొడ్డలి పోటు వేస్తారో, పోలీసులు గోడ దూకి మనింటికి వస్తారని, ఆదే జగన్ గొడ్డలిపోటుతో బాబాయిను చంపితే మాత్రం కేసులుండవన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితే పోలీసులు వస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఓ హింసవాది ముఖ్యమంత్రి కావడం అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనన్నారు. ఇప్పుడు దొంగను సీఎం చేశారన్నారు. భయపెట్టి అన్ని ఆస్తులు రాయించేసుకుంటున్నారని విశాఖ భూముల వ్యవహారాన్ని గుర్తుచేశారు. కొంతమంది పోలీసులు మనసు చంపుకుని ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
tdp chief chandrababu on today slams ysrcp govt and cm jagan in tdp's idem kharma mana rastraniki programme in eluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X