సీఎం హోదాలో జగన్ తిరుమలలో ఏం చేశాడో తెలుసా?, చంద్రబాబు
తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చెయ్యడానికి జంతువుల కొవ్వు ఉపయోగించాలని వెలుగు చూడడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉంటే అన్యమతస్తులు సాంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని, కానీ సీఎం హోదాని అడ్డం పెట్టుకొని జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమలకు వెళ్లారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమలకు మీరు ఎందుకు వెళ్లాలి, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తిరుమల సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయడానికి కాదని సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ను నిలదీశారు.

ఈ విషయంపై మేము ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు మమ్మల్ని బూతులు తిట్టారని సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలపై అప్పటి పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తిరుమలలో లడ్డు పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఇప్పుడు ఏమైందని వైసీపీ నాయకులు అప్పట్లో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, రథం కాలిపోతే తేనెటీగలు వచ్చి రథాన్ని కాల్చేశాయని ప్రజలను తప్పుదోవ పట్టించారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, శ్రీవారి భక్తుల ఓపికను పరీక్షించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక దేవాలయాల్లో జరిగిన సంఘటనల పట్ల అప్పటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలు దెబ్బ తీసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అయితే జగన్ కు శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా ? లేదా ? అనేది ముఖ్యమని, తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని, డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని సీఎం చంద్రబాబు నాయుడు నిలదీశారు. సీఎం హోదా అడ్డం పెట్టుకొని తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారిని దర్శించుకున్న జగన్ తిరుమల సాంప్రదాయానికి మచ్చ తెచ్చారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్ సీఎం హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సమయంలో ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని, తిరుమల సంప్రదాయాన్ని పట్టించుకోలేదని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.












Click it and Unblock the Notifications