వైసీపీ హయాంలో విద్యుత్ రంగం పతనమిలా..! చంద్రబాబు శ్వేతపత్రం విడుదల..!
ఏపీలో గత ఐదేళ్ల పాలనలో వివిధ రంగాలు ఎలా నష్టపోయాయో ప్రజలకు వివరించేందుకు సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ విద్యుత్ రంగ తాజా పరిస్ధితిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేసారు.ఇందులో గత వైసీపీ పాలనలో విద్యుత్ రంగం ఎలా విధ్వంసమైందో, ఛార్జీల పెంపు నిరాటంకంగా ఎలా కొనసాగిందో గణాంకాలతో పాటు వివరించారు. దీన్ని సరిదిద్దేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
రాష్ట్రంలోని వేర్వేరు అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఏ అంశాలు ఎలా ధ్వంసం అయ్యయో తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయన్నారు. అన్ని శాఖల్లో నూ ఇదే పరిస్థితి ఉందన్నారు. అందుకే రాష్ట్రానికి బాధ్యతా యుతమైన నాయకుడు ఉండాలి దీనిపై ఆలోచించమని ప్రజలకు చెబుతున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్ ను దారుణం గా దెబ్బ తీశారన్నారు. మెరుగైన పాలన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. విద్యుత్ ఎప్పుడూ అభివృద్ధి కి సూచికే అని తెలిపారు.

1995 - 2004 లో తొలిసారి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. 2019-24 లో మధ్య గత ప్రభుత్వ హాయంలో 1,29 లక్షల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలు పై తెచ్చారన్నారు. 2019-24 మధ్య విద్యుత్ టారిఫ్ కూడా పెరిగింది. ప్రజల పై భారం మోపారన్నారు. విద్యుత్ సంస్థలు నష్టాలు చవిచూశాయన్నారు. 1995-2004 మధ్య విద్యుత్ సంస్కరణ ల్లో భాగం గా విద్యుత్ నియంత్రణ మండలి దేశంలోనే ఏర్పాటు అయ్యిందన్నారు. విద్యుత్ సంస్కరణ ల వల్ల అప్పట్లో మా ప్రభుత్వం ఓడి పోయినా విద్యుత్ సంస్కరణ లు గెలిచాయన్నారు. ఏపీకి విద్యుత్ మిగులు కూడా వచ్చిందన్నారు.
2019-2024 మధ్య ఒక అసమర్ధుడు వచ్చి విద్యుత్ రంగం అప్పు 1 లక్షా 29 వేల ఐదు వందల కోట్లు చేశాడు. 9 సార్లు విద్యుత్ చార్జీల బాదుడు ఇందుకే..#AndhraPradesh pic.twitter.com/7DiSaSU1lF
— Telugu Desam Party (@JaiTDP) July 9, 2024
2014 నుంచి లో విద్యుత్ ఉత్పత్తి 9453 మెగా వాట్ల మేర పెంచామని చంద్రబాబు తెలిపారు. తలసరి వినియోగం ఏపీ లో 1234 యూనిట్ లకు పెరిగిందన్నారు. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రం గా ఏపీ ఎదిగిందన్నారు. మొత్తం గా 2018-19 నాటికి 14,929 మెగా వాట్ ల ఉత్పత్తికి చేరేలా కృషి చేశామన్నారు. ఆ తర్వాత జరిగిన విధ్వంసం కారణంగా తిరిగి ఇబ్బందికరమైన పరిస్ధితులు తలెత్తాయన్నారు. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.












Click it and Unblock the Notifications