రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం పాకులాట: కర్ణాటక పరిణామాలపై చంద్రబాబు విమర్శలు

ప్రకాశం: కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై ఏపీ సీఎం, టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా లేదని చంద్రబాబునాయుడు విమర్శించారు.

గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరినా కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం ఎంత వరకు న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు.

Chandrababu response on Karnataka politics

రాజ్యాంగ పరంగా, ప్రజాస్వామ్యయుతంగా కేంద్రం నడుచుకోవడం లేదని అన్నారు.
కాగా, చంద్రబాబు తన పర్యటన సందర్భంగా వలేటివారిపాలెం మండలం పోకూరులో నీరు-ప్రగతి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత అదే మండలంలోని నూకవరం, బడేవారిపాలెం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

అనంతరం గురువారం సాయంత్రం కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పట్టిసీమ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం జిల్లా మీదుగా సోమశిలకు తరలిస్తామని చంద్రబాబు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+