వరదలపై బాబు కలెక్టర్లకు ఆదేశాలు: భేటీలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రవహిస్తున్న వివిధ నదుల పరిస్తితులను ఆయన మంగళవారంనాడు సమీక్షించారు. వరదల్లో చిక్కుకున్న గ్రామాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేసించారు.
ఉభయ గోదావరి జిల్లాల గిరిజన ప్రాంతాలు, కోనసీమ ప్రాంతాల్లో పలు మండలాలకు గోదావరి వరద ముంపు వల్ల ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. ఏటిగట్టు బలహీనంగా ఉన్న చోట్ల ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
ఇదిలావుంటే, పంచదార కర్మాగారంపై చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. అదే విధంగా బైరైటిస్ కడప మంగంపేట కూడా ఆయన సమావేశం నిర్వహించారు.

పంచదార కర్మాగారంపై భేటీ
పంచదార కర్మాగారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు.

పంచదార కర్మాగారంపై సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు.

బైరేటీస్‌పై చంద్రబాబు
బైరెటీస్ కడప మంగంపేటపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు సమావేశం నిర్వహించారు.

మంగంపేట బైరెటీస్‌పై సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బైరెటీస్ కడప మంగంపేటపై మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications