Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుది 420 విజన్ .. మీ 2020 విజన్ ఇదేనా : రోజా ఫైర్

Recommended Video

    YCP MLA Roja Slams AP Former Cheif Chandrababu Naidu Over Amaravathi Issue || Oneindia Telugu

    నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు విజన్‌ 2020 ఏంటో ఇప్పుడు బయట పడిందన్నారు. చంద్రబాబు ఒక 420 అని ఫైర్ అయ్యారు . ఇక చంద్రబాబు విజన్ అమరావతి విషయంలోనే బయటపడిందన్నారు ఎమ్మెల్యే రోజా. రాజధాని పేరుతో దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారనిఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో కోట్లు ఖర్చుపెట్టినా కొడుకు నారా లోకేష్‌‌ను గెలిపించుకోలేకపోయారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత కాదు పనికిమాలిన నేత అని తిట్టిపోశారు.

     40 ఏళ్ల కుర్రాడి దెబ్బకు చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నారన్న రోజా

    40 ఏళ్ల కుర్రాడి దెబ్బకు చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నారన్న రోజా

    సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన రోజా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది 420 విజన్‌ అన్న రోజా ఆయన 2020 విజన్ లో 20 మంది ఎమ్మెల్యేలతో.. 20 గ్రామాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల కుర్రాడి దెబ్బకు చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నారని ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజా సమస్యలపై ఏ రోజైనా జోలె పట్టారా అని ప్రశ్నించిన రోజా చంద్రబాబురాయలసీమ ద్రోహి అని విరుచుకుపడ్డారు.

    టీడీపీకి పుట్టగతులు ఉండవని శాపనార్ధాలు

    టీడీపీకి పుట్టగతులు ఉండవని శాపనార్ధాలు

    పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి ఎందుకొచ్చారని రోజా ప్రశ్నించారు. ఐదేళ్లలో రాజధానిలో ఒక్క శాశ్వత భవానాన్ని నిర్మించగలిగారా అని బాబుని నిలదీశారు. అంతే కాదు సీఎం జగన్ ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటే టీడీపీకి పుట్టగతులు ఉండవన్నారు. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్‌రూమ్‌లేనా అంటూ ఫైర్ అయిన రోజా చంద్రబాబు కావాలని రాజధాని రైతుల ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు .

    రైతుల ముసుగులో చంద్రబాబు డ్రామాలు అంటూ ఫైర్

    రైతుల ముసుగులో చంద్రబాబు డ్రామాలు అంటూ ఫైర్

    మూడు రాజధానుల అంశాన్ని అడ్డుకునేందుకు ఛలో అమరావతికి చంద్రబాబు పిలుపునివ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో చంద్రబాబు డ్రామాలడుతున్నారని రోజా పేర్కొన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కు చంద్రబాబు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో లక్షా పదివేల కోట్ల రూపాయలు అవసరమన్న చంద్రబాబు.. ఇప్పుడు రెండు వేల కోట్లతో పూర్తవుతుందంటున్నారని రోజా మండిపడ్డారు.

    విజన్‌ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తెలిసిందన్న రోజా

    విజన్‌ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తెలిసిందన్న రోజా

    అమరావతి అనే భమ్రలో ప్రజలను మోసం చేసి కేవలం గ్రాఫిక్స్‌తోనే ఐదేళ్లు కాలం గడిపారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్‌ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తేటతెల్లమైందన్నారు. చట్టసభల్ని అడ్డుకోవడమే చంద్రబాబు విజనా ? అలజడులు సృష్టించడమే చంద్రబాబు విజనా? అంటూ రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+