వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఐడీ నోటీసులు , తనపై నమోదైన కేసులపై చంద్రబాబు న్యాయపోరాటం .. రేపు హైకోర్టులో పిటీషన్

|
Google Oneindia TeluguNews

అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో చంద్రబాబు ఈనెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏపీ సిఐడి నిన్న చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఎస్సీ ఎస్టీ చట్టం తో సహా 10 సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసి ఈనెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలని చంద్రబాబుకు నోటీసు అందించారు. విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే సిఐడి నోటీసు ఇవ్వడంపై, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడంపై చంద్రబాబు రేపు హై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.

సీఎం జగన్ అధ్యక్షతన ఆ సమావేశానికి చంద్రబాబు .. సిఐడీ నోటీసుల తర్వాత ఇంట్రెస్టింగ్సీఎం జగన్ అధ్యక్షతన ఆ సమావేశానికి చంద్రబాబు .. సిఐడీ నోటీసుల తర్వాత ఇంట్రెస్టింగ్

 రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్న చంద్రబాబు

రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్న చంద్రబాబు

సిఐడి నోటీసు వ్యవహారంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అక్రమాలపై తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చంద్రబాబు తన పిటిషన్ ద్వారా కోరనున్నారు.
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరావతిలో భూమి కేటాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి నోటీసుకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు .

 చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటంపై టీడీపీ నేతల ఆగ్రహం

చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటంపై టీడీపీ నేతల ఆగ్రహం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యపై ప్రజల దృష్టిని మరల్చడం కోసమే , ఇదంతా అధికార పార్టీ ఆడుతున్న నాటకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు గతంలోనే చెప్పిందని, అలాంటప్పుడు సిఐడి నోటీసు ఏ ప్రాతిపదికన ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇది కావాలని చంద్రబాబును ఇరికించే కుట్ర అని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు .

తనపై పెట్టిన కేసులపై కోర్టు మెట్లెక్కనున్న చంద్రబాబు

తనపై పెట్టిన కేసులపై కోర్టు మెట్లెక్కనున్న చంద్రబాబు


ఇదిలా ఉంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కు, మాజీ మంత్రి నారాయణకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సి ఆర్ పి సి తో పాటు ఎఫ్ ఐ ఆర్ ప్రతిని కూడా సిఐడి పోలీసులు చంద్రబాబు, నారాయణ లకు అందజేశారు. చంద్రబాబుపై 120 బీ , 166, 167, 277 సెక్షన్ల కింద , ఐపీసీ రెడ్ విత్ 34, 35, 36 ,37 లతోపాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 3(1) (ఎఫ్ ) (జీ ) పైన కూడా కేసులు నమోదు చేశారు. ఏపీ అసైన్డ్ చట్టం ( పీవోటి)1977 లోని సెక్షన్ 7 ను కూడా చేర్చారు.

ఈ కేసులపై చంద్రబాబు న్యాయపోరాటానికి కోర్టు మెట్లెక్కనున్నారు.

English summary
Chandrababu, who has sought the advice of legal experts on the CID notice issue, will file a petition in the high court tomorrow. Through his petition, Chandrababu will seek to quash the FIR registered against him over land irregularities in Amravati.TDP chief Chandrababu Naidu alleged that the YSRCP government had targeted him. The former chief minister said he would approach the court and take legal action against the CID notice facing allegations of allotment of land in Amravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X