ఆ ఉద్యోగులకు చంద్రబాబు తీపికబురు.. ఇక వాళ్లకు పండుగే!
సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ ఎప్పుడెప్పుడు తన సొంత రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి వెళదామా అని నిరీక్షిస్తున్న వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పనిచేస్తూ సుమారు పదకొండు సంవత్సరాలుగా తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లాలని ఆకాంక్షిస్తున్న 58మంది తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సొంత రాష్ట్రానికి పంపాలని ఆ ఉద్యోగుల వినతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన ఉద్యోగుల విభజన ప్రక్రియలో భాగంగా కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఏపీ కేటాయింపులలో చేరారు. వీరిలో క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్యోగులు ఉన్నారు. వీరంతా తమను తమ సొంత రాష్ట్రాలకు పంపించాలని చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అనేకమార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు.

వారిని బదిలీ చేస్తూ చంద్రబాబు తీపికబురు
గతంలో చంద్రబాబు హయాంలోనూ, ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలోనూ వీరు తమను తెలంగాణకు పంపించాలని విజ్ఞప్తులు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ ఉద్యోగుల బదిలీ అంశం పైన దృష్టి సారించారు. తెలంగాణ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి ఏపీలో పని చేస్తున్న 58 మంది ఉద్యోగులను, వారి స్వరాష్ట్రమైన తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వారిని రిలీవ్ చేయటానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే గతంలో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఏపీ నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం, తాజాగా మరో 58 మందిని రిలీవ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీరిని బదిలీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన కొన్ని షరతులకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 698 మంది తెలంగాణ ఉద్యోగులు తమ స్వరాష్ట్రానికి వెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
58 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్న ఏపీ సర్కార్
అయితే దశలవారీగా 698 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపించారు. ఇక ఇప్పుడు మిగిలి ఉన్న 58 మంది ఉద్యోగులను కూడా చంద్రబాబు ప్రభుత్వం రిలీవ్ చేస్తోంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన భేటీలో ఉద్యోగుల సమస్యల పైన కూడా చర్చకు వచ్చింది.
త్వరలో తెలంగాణా ప్రభుత్వ సర్వీసులలో వారు
ఆ చర్చలలో చంద్రబాబు తెలంగాణ ఉద్యోగుల విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా వారిని రిలీవ్ చేసి తెలంగాణకు పంపించడానికి అంగీకారం తెలుపగా, ఇది జరిగిన కొద్ది నెలల వ్యవధిలోనే ఏపీ సర్కార్. ఇక వీరంతా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సర్వీసులలో ఉద్యోగంలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications