సిమెంట్ కంపెనీల : చంద్రబాబు నాయుడు
సిమెంట్ కంపెనీల : చంద్రబాబు నాయుడు
అంతర్జాతీయ నగరంగా అమరావతిని నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయనతో సిమెంట్ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరంతోపాటు పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, పోలవరం ప్రాజెక్ట్‌కే దాదాపు ఒక మిలియన్ టన్నుల సిమెంట్ అవసరముంటుందని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు తెలిపారు. గృహనిర్మాణ రంగానికి పెద్దపీట వేస్తామని, భారీ ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులకు అనుగుణంగా ప్రభుత్వానికి తక్కువ ధరకు సిమెంట్ సరఫరా చేయాలని చంద్రబాబు ప్రతినిధులను కోరారు.












Click it and Unblock the Notifications