వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షోభంలో ఉన్నాం, మాట్లాడొద్దు: బాబు కీలక వ్యాఖ్యలు, అఖిల పక్షం కాదు.. ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Naidu Say No To All Party Meeting

అమరావతి: ప్రస్తుతం సంక్షోభ సమయం నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు మంగళవారం కీలక సూచనలు చేశారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మధ్యాహ్నం ముగిసింది.

జగన్-పవన్‌లు తొలిసారి ఇలా..: హడావుడిగా వెళ్లిన జనసేనాని, ఇరకాటంలో బాబుజగన్-పవన్‌లు తొలిసారి ఇలా..: హడావుడిగా వెళ్లిన జనసేనాని, ఇరకాటంలో బాబు

ఈ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అలాగే ప్రత్యేక హోదా లేదా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల విషయంలో అఖిల పక్షానికి బదులు అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీపై నోరు జారవద్దని సూచించారు.

 పోరాడే వారితో కలిసి ముందుకు

పోరాడే వారితో కలిసి ముందుకు

అందరి అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుదామని చంద్రబాబు చెప్పారు. పార్టీలతో పాటు ఏపీ ప్రరయోజనాల కోసం పోరాడే సంఘాలను కూడా కలుపుకొని వెళ్దామని చెప్పారు. హక్కుల సాధన కోసం కలిసి వచ్చే వారి ప్రతి ఒక్కరితో ముందుకు సాగుదామని చెప్పారు.

 వైసీపీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు

వైసీపీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు అనంతరం అందరితో సమావేశమవుదామని చెప్పారు. పార్టీలతో కాకుండా పార్టీలకు అతీతంగా అందరితో మాట్లాడుదామని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడే వారినే సమావేశానికి పిలుద్దామని చెప్పారు.

 సంక్షోభ సమయం ఎవరూ తొందరపడొద్దు

సంక్షోభ సమయం ఎవరూ తొందరపడొద్దు

ఏపీకి బడ్జెట్‌లో కేంద్రం మొండి చేయి చూపిందని, అలాగే విభజన హామీల విషయంలో బీజేపీ చెప్పినట్లుగా నడుచుకోవడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఉన్నామని, ఎవరూ తొందరపడి మాట్లాడవద్దన్నారు.

బెయిల్ కోసం జగన్ తంటాలు

బెయిల్ కోసం జగన్ తంటాలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి జవహర్ వేరుగా మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నిర్ణయం మంచిదేనని చెప్పారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పడం అంతా నాటకమన్నారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయం చేశాయన్నారు. జగన్ బెయిల్ కోసం తంటాలు పడుతున్నారన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu said that no to All Party meeting but he is planning to all associations meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X