వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు; ఆ వ్యాఖ్యల వెనుక బాబు వ్యూహం ఇదేనా!!

|
Google Oneindia TeluguNews

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు రోజుకో కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగడం కోసం విఫలయత్నాలు చేయాల్సి వస్తుంది. టిడిపి అధినేత చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజా మద్దతును కూడగట్టాలని పార్టీ శ్రేణులకు చెబుతూనే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు మినహాయించి, మిగతా వారెవరూ యాక్టివ్ గా పని చేయడం లేదు.

సీనియారిటీ ఉన్న నేతలు ఓట్లు వేయించలేకపోతే ఏం లాభం.. చంద్రబాబు విసుర్లు

సీనియారిటీ ఉన్న నేతలు ఓట్లు వేయించలేకపోతే ఏం లాభం.. చంద్రబాబు విసుర్లు


గతంలో టీడీపీలో చక్రం తిప్పిన నేతలు, మంత్రులుగా పనిచేసిన వారు కూడా, ప్రస్తుతం సైలెంటుగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ పరిస్థితులను టీడీపీ అధినేత చంద్రబాబు సహించలేకపోతున్నారు. అందుకే ఆయన తాజాగా పార్టీలో నేతల పనితీరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ ఉన్న నేతలు ప్రజలతో ఓట్లు వేయించ లేకపోతే, ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా కూర్చుంటే ఏం ప్రయోజనం అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీనియారిటీ ఉన్న నేతలు ఓటు వేయించ లేకపోతే అటువంటి నాయకులు ఉండి కూడా ప్రయోజనం లేదని, అలాంటి నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకోవడం తప్పు అని చంద్రబాబు మండిపడ్డారు.

యాక్టివ్ గా పని చెయ్యని సీనియర్ నేతలకు చంద్రబాబు షాక్

యాక్టివ్ గా పని చెయ్యని సీనియర్ నేతలకు చంద్రబాబు షాక్

ఇక అలా పార్టీ కోసం పని చేయకుండా, ప్రజాక్షేత్రంలో తిరగకుండా కేవలం పార్టీ ఆఫీసుకు వచ్చి తమకు సముచిత స్థానం కావాలంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని చంద్రబాబు కుండ బద్దలు కొట్టారు. తాజా చంద్రబాబు వ్యాఖ్యలతో యాక్టివ్ గా లేని సీనియర్ నేతలకు షాక్ తగిలినట్టైంది. ఇంత కాలం చంద్రబాబు పార్టీలో కొందరు కీలక నేతలు యాక్టివ్ గా పని చేయనప్పటికీ వారిని గట్టిగా ప్రశ్నించలేదు. ఒకవేళ ప్రశ్నిస్తే పార్టీ ఫిరాయిస్తారేమో అన్న ఆందోళన చంద్రబాబులో ఉండేది.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో కుండ బద్దలు కొట్టిన చంద్రబాబు

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో కుండ బద్దలు కొట్టిన చంద్రబాబు

కానీ ఇప్పుడు వైసిపి మూడేళ్ల పాలన పూర్తయింది. ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓట్లు వేయించలేని సీనియర్లు తమకు ప్రాధాన్యత కావాలని కోరినా ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలో యాక్టివ్ గా పనిచేసే యువ నేతలకే గుర్తింపు ఉందని, ఈసారి 40 శాతం యువతకు సీట్లు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. సీనియర్ నేతల వారసులు మాత్రమే కాదు, తటస్థ యువకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

డైలమాలో టీడీపీ సీనియర్లు ... చంద్రబాబు క్లాస్ తర్వాత అయినా దారిలోకి వస్తారా?

డైలమాలో టీడీపీ సీనియర్లు ... చంద్రబాబు క్లాస్ తర్వాత అయినా దారిలోకి వస్తారా?

అంటే ఈ సారి ఎన్నికలలో ఎక్కువగా యువకులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో, తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కొందరు డైలమాలో పడ్డారు. ఈసారి ఎన్నికలలో తమకు ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. పార్టీలో ఉండి, ఉండి లేనట్టుగా ఉంటున్న కొందరు నేతల తీరు నచ్చక చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో ఉంటే పనైనా చెయ్యాలి, లేదంటే పార్టీ వీడి వెళ్ళాలి. అలా కాకుండా పార్టీలో కొనసాగినా ఎన్నికల సమయంలో తమకు పాధాన్యత కావాలని అడగకుండా అయినా ఉంటారని చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. మరి చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో ఇంతకాలం గోడమీద పిల్లిలా ఉన్న సీనియర్ నాయకులు గోడ దూకుతారా? లేక చంద్రబాబు క్లాస్ తర్వాత అయినా దారిలోకి వస్తారా? అన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

English summary
Chandrababu gave shock to senior leaders who are silent in the party. He said that this time we are giving priority to the youth and those who are not working have no right to ask for priority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X