టీడీపీలోకి వచ్చే వైసీపీ నేతలపై చంద్రబాబు షాకింగ్ నిర్ణయం!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు కొందరు నేతలు ఎదురుచూస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీ నాయకులతో ఉండవల్లిలో సమావేశమైన క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనకు టచ్లో చాలామంది వచ్చారని, అయితే వారి గ్రాఫ్, ప్రజలలో వారికున్న సానుభూతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

ఎంతోమంది తనతో టచ్ లోకి వచ్చారని, అయితే అందరికీ తాను స్వాగతం పలకలేనని, తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్న వారు ఎందుకు వస్తున్నారో .. వారు ఏం చేయాలని భావిస్తున్నారో తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలామంది టికెట్లు ఆశించి వస్తున్నారని, వచ్చిన వారందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోలేమని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu shocking decision on YCP leaders joining in TDP!!

ఇప్పటికే పొత్తుల కారణంగా టిడిపిలో చాలామంది కీలక నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టాల్సి వచ్చిందని చంద్రబాబు తన నివాసంలో భేటీ అయిన క్రమంలో పేర్కొన్నారు. ఇక రానున్న ఎన్నికలను ఉద్దేశించి పార్టీ సీనియర్ నాయకులకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, తన ప్లాన్ ను వివరించారు.

ఎన్నికలకు 56 రోజులు మాత్రమే గడువు ఉందని, ఇప్పటివరకు ఎవరు ఏం చేశారు? ఎలా ఉన్నారు? అన్నదాన్ని తను ప్రశ్నించదలుచుకో లేదని, కానీ ఈ 56 రోజులు మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. ఇప్పటికే తాను రా కదలిరా సభలతో ప్రజలలోకి వెళ్లానని పేర్కొన్న చంద్రబాబు, ప్రస్తుతం శంఖారావం కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu shocking decision on YCP leaders joining in TDP!!

భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే టిడిపిలో పొత్తుల వల్ల, కొత్తగా జరిగిన చేరికల వల్ల చాలామంది ఎప్పటి నుండో కష్టపడిన నేతలకు టికెట్లు రాలేదని పేర్కొన్న చంద్రబాబు వారికి భవిష్యత్తులో నష్టం జరగకుండా చూడటానికే ప్రాధాన్యత ఇస్తానని, ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించే దిశగా పార్టీని ముందుకు నడిపించాలి అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని, పార్టీ కోసం పని చేసే వారిని విస్మరించేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అందరికి దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+