మొదటి నుండి చెప్తున్నా: ఏకిపారేసిన బాబు, జగన్‌పైనా

ప్రజాకోర్టులో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలను నిలబెడతామన్నారు. విభజనపై ఏకపక్షమంటూ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాకే కేంద్రం మళ్లీ లేఖలు పంపించిందన్నారు. కాంగ్రెసు పార్టీ నుండి వెళ్లిన వారు జివోఎం భేటీలో రెండు వాదనలు వినిపించడమేమిటన్నారు. కాంగ్రెసు నాటకాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఇరు ప్రాంత నేతలను అధిష్టానమే పంపించి, రెండు వాదనలు చెప్పించి నాటకాలాడుతోందన్నారు.
ఢిల్లీ ఆదేశాలతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జివోఎం భేటీకీ హాజరవుతోందన్నారు. విభజన హేతుబద్దంగా లేదని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. విభజన అంశంపై కేంద్రం దగ్గర సరైన సమాచారం లేదని జివోఎం భేటీతో రుజువైందన్నారు. సమాచారం లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. విభజనపై తీర్మానం చేసి, కేబినెట్ ఆమోదం పొందాక మళ్లీ కాంగ్రెసు పార్టీ నుండి దామోదర, వట్టి వసంత్ కుమార్ వెళ్లి అభిప్రాయం చెప్పడమేమిటన్నారు.
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రహస్య మంతనాలేంటని ప్రశ్నించారు. విభజనపై ఏర్పాటు చేస్తున్న సమావేశాలు అంతా ప్రహసనం అన్నారు. కాంగ్రెసు అధిష్టానం చెప్పినట్లు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెసు రాజకీయ నాటకాలతో పార్టీలు, నాయకుల పైన ప్రజల్లో విశ్వాసం పోయిందని మండిపడ్డారు. తనకు కెసిఆర్‌లా మైండ్ గేమ్ ఆడే తెలివి లేదని ఎద్దేవా చేశారు.
తాము అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఒకటే చెబుతున్నామన్నారు. సమన్యాయం చేసి విభజించాలన్నారు. రెండు ప్రాంతాల జెఏసిలను, ప్రతినిధులను పిలిచి మాట్లాడాలని తాము డిమాండ్ చేస్తున్నామని, దానిని ఎందుకు పెడ చెవిన పెట్టారన్నారు. ఆంటోని కమిటీ నివేదిక ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలు పగలు రిపోర్ట్ రాసి రాత్రి లీకులు ఇస్తారని, అదేమిటని అడిగితే తాము లీసులు ఇవ్వలేదంటున్నారు. రెండు మూడు నెలలకు పోయే ప్రధాని సీమాంధ్రకు ఏం న్యాయం చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications