వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాక్షసజాతిలా ఈ ప్రభుత్వ అరాచకం; తప్పుచేసిన వారిని ప్రశ్నించే హక్కు అందరికీ ఉందన్న చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేఖ పాలనపై మండిపడుతున్న చంద్రబాబు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నాడు కూడా జగన్ పాలన ను టార్గెట్ చేశారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై, వైసీపీ పాలన పై, సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.

మళ్ళీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ... ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేనిమళ్ళీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ... ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేని

నవరత్నాలను నమ్మి నవ గ్రహాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు

నవరత్నాలను నమ్మి నవ గ్రహాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు

ఏపీ ప్రజలు నవరత్నాలు నమ్మి ఇప్పుడు నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగుల దినోత్సవం లో మాట్లాడిన చంద్రబాబు రాజ్యాంగం ఇంకా బతికే ఉందని, తప్పు చేసిన వారిని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని వెల్లడించారు. దివ్యాంగులను చట్టసభలకు పంపే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అని పేర్కొన్న చంద్రబాబు, దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేశామని గుర్తు చేశారు.

 మేం అధికారంలోకి వచ్చాక కమీషన్ వెయ్యటం ఖాయం

మేం అధికారంలోకి వచ్చాక కమీషన్ వెయ్యటం ఖాయం

విభిన్న ప్రతిభావంతులు 500 రూపాయలు ఉండే పెన్షన్ 3000 రూపాయలు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ వేయడం ఖాయమని, తప్పు చేసిన వారికి అప్పుడు చర్యలు తప్పవని చంద్రబాబు పేర్కొన్నారు. రాక్షస జాతిలా ఈ ప్రభుత్వం ప్రజలను పీల్చుకు తింటోంది అంటూ చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో దివ్యాంగులు అయిన కోటేశ్వరరావు ఎన్టీఆర్ కు, తనకు పైలెట్ గా ఉండేవాడని చెప్పుకొచ్చిన చంద్రబాబు ప్రతి టూర్ లో కోటేశ్వరావు ముందు వెళ్లేవారని గుర్తు చేశారు.

దివ్యాంగులు చట్ట సభలకు వెళ్ళే బాధ్యత తాను తీసుకుంటా అన్న చంద్రబాబు

దివ్యాంగులు చట్ట సభలకు వెళ్ళే బాధ్యత తాను తీసుకుంటా అన్న చంద్రబాబు

దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదని పేర్కొన్న చంద్రబాబు వారు చట్టసభలకు వెళ్లే బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇక జగన్ ని టార్గెట్ చేసిన చంద్రబాబు ఎప్పుడు ఎన్టీఆర్ కట్టిన ఇంటికి ఇప్పుడు జగన్ పట్టా ఇస్తానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలపై వేధింపులు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నాడు కూడా చంద్రబాబు వైసిపి సర్కారు తీరును ఎండగట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలన పై చంద్రబాబు ధ్వజమెత్తారు.

 వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం

వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం

ఇక వైసిపి సర్కారుపై సమరం ప్రకటించిన చంద్రబాబు ఇప్పటికే ఏపీలో ఇళ్ల పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ పై జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా తనకు అవమానం జరిగిందని వాపోయిన చంద్రబాబు, కౌరవ సభలో అడుగు పెట్టనని చెప్పానని ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర తేల్చుకున్న తర్వాతనే, గౌరవంగా సభ నడిపితే గౌరవ సభలో అడుగు పెడతానని వెల్లడించారు. ఈ మేరకు గ్రామాల్లో గౌరవ సభ్యులు పెట్టి ప్రజా సమస్యలపై చర్చించాలని తెలుగు తమ్ముళ్లకు, చంద్రబాబు రాష్ట్రంలో సమస్యలు తాజా పరిస్థితులపై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.

Recommended Video

Farms Laws వెనక్కి తీసుకోవడం KCR విజయం! - TRS నేతలు || Oneindia Telugu

దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ప్రపంచం దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్న వేళ... ఆత్మవిశ్వాసంతో ఎవరికీ తీసిపోమంటూ ముందడుగేస్తోన్న దివ్యాంగులకు శుభాకాంక్షలు అని చంద్రబాబు పేర్కొన్నారు.ఇటీవల పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు 5 స్వర్ణాలతో సహా 19 పతకాలను దేశానికి సాధించి పెట్టారంటే... అంతకుమించిన స్ఫూర్తిదాయక విషయం ఏముంటుంది అంటూ చంద్రబాబు దివ్యాంగులను అభినందించారు.

English summary
Chandrababu slams jagan government anarchy like a monster. Believing in the Navratnas, he was incensed that people were roaming around the nine planets. Chandrababu, said on International disability Day that everyone has the right to question those who have done wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X