పవన్ కల్యాణ్ ఎఫెక్ట్: పందుల వ్యాఖ్యలపై సుజనాకు చంద్రబాబు క్లాస్

పందుల వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు సుజనా చౌదరికి క్లాస్ తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడడంతో ఆయన ఈ క్లాస్ తీసుకున్నారు.

హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనాచౌదరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై యువత చేస్తున్న పోరాటం గురించి మాట్లాడుతూ పందుల ఆట ఆడుకోమంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ యువకులతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఈ వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు.. భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుజనాకు సూచించారు. ఇతరుల మనోభావాలను గాయపర్చొద్దని చంద్రబాబు హితవు పలికారు.

Chandrababu takes class to Sujana Chowdary

ప్రతిపక్షంలో ఉన్నవారు ఏదైనా మాట్లాడుతారని, అధికారంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని చంద్రబాబు సుజనాకు సూచించారు. మీరు వాడే భాష ఇతరులను నొప్పించే విధంగా ఉండొద్దని, సున్నితమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు సుజనా చౌదరికి సూచించారు.

యువత పోరాట స్ఫూర్తిని సుజనా చౌదరి 'పందులు పందాలు'తో పోల్చడం బాధాకరమని పవన్ ట్వీట్ చేశారు. ఇక మీరు నోరు జారే కొద్ది యువతను రెచ్చగొట్టడమే.. సరే అలాగే కానివ్వండని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+