ఆ హృదయ విదారక వీడియోతో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీపై మాటల దాడిని పెంచుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలతో జగన్ సర్కార్ పాలనా వైఫల్యాలను తూర్పారబడుతున్న చంద్రబాబు తాజాగా జరిగిన ఒక ఘటన తాలూకు వీడియో పోస్ట్ చేసి ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

విజయనగరం జిల్లా ఏజెన్సీలో బాలింత మహిళ, ఆరు నెలల చిన్నారి అనారోగ్యం బారిన పడగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లటం కోసం నానా అగచాట్లు పడిన దృశ్యాలను, చివరకు తల్లీ, బిడ్డ చనిపోయారన్న విషయాన్ని తెలియజేసిన చంద్రబాబు, కనీసం మృతదేహాలను తరలించటం కోసం అంబులెన్స్ కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అలసత్వం వల్లనే ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. హృదయ విదారకమైన వీడియో ను పోస్ట్ చేశారు.

 chandrababu targets ys jagan with a shocking video

విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని చంద్రబాబు పేర్కొన్నారు . తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను, ఆరునెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సి రావడం దురదృష్టకరమైన సంఘటన అని చంద్రబాబు పేర్కొన్నారు . గతంలో ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో ఫీడర్ అంబులెన్స్ లు తెచ్చామని ఇప్పుడు వాటిని వాడటం లేదన్నారు.

ఫీడర్ అంబులెన్స్ లు పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తల్లీ, బిడ్డ చనిపోడానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా? అంటూ చంద్రబాబు జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు మృతదేహాన్ని తీసుకు వెళ్ళడానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేరా? అని జగన్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న సంధించారు.

ఏమై పోయాయి అంబులెన్సులు? అని ప్రశ్నించిన ఆయన పుట్టెడు దుఃఖంలో భార్య మృతదేహాన్ని బైక్ మీద తీసుకువెళ్లాల్సి రావడం ఎంత దయనీయం? ఎంత బాధాకరం? అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులకు ఎందుకీ దుస్థితి? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని... ఘటనపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు . ఆ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు . చిట్టంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని పేర్కొన్న చంద్రబాబు బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+