రాజధాని డెవలపర్‌పై బాబు దృష్టి, అమరావతి భూకంపాల జోన్‌లో ఉందా?

అమరావతి/హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో రాజధాని నిర్మాణం కోసం డెవలపర్‌ను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు.

పుష్కరాల అనంతరం చంద్రబాబు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఏపీ రాజధానిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టే కన్సార్టియంకు మొగ్గు చూపవచ్చునని తెలుస్తోంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతిని నిర్మించనున్నారు.

అమరావతి భూకంపాల జోన్‌లో ఉందా?

Chandrababu to select capital city developer soon

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూకంపాల జోన్ 3లో ఉన్నదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అధిపతి చెప్పారు. కృష్ణా నది తీరంలోని విజయవాడ తీర ప్రాంతాలు జోన్ 3 కిందకు వస్తాయని చెబుతున్నారు.

జోన్ 4, జోన్ 5, జోన్ 6 భూకంపాలతో పోలిస్తే జోన్ 3 తీవ్రత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నేపాల్ సరిహద్దు ప్రాంతాలు, కాశ్మీర్ జోన్ 5లో ఉన్నాయి. టోక్యో, కాలిఫోర్నియాలాంటి నగరాలు జోన్ 5 కన్నా అత్యధిక తీవ్రత కలిగి ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో, భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా కట్టడాలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+