అవార్డులిస్తాం: తెలంగాణను దాటేయాలని చంద్రబాబు చూస్తున్నారా?
విజయవాడ: ఒకే రోజు కోటి మొక్కలు నాటడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణను బీట్ చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది. ఏపీలో ఒకే రోజు కోడటి మొక్కలు నాటి రికార్డు సృష్టించాలని గురువారం నాడు పిలుపునిచ్చారు.
జూలై చివరి వారంలో ఈ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొక్కల పెంపకానికి కృషి చేసిన వారికి విభాగాల వారీగా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. మొక్కల పెంపకం, ఎర్ర చందనంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం 23.04 శాతం మాత్రమే ఉందని, వచ్చే నాలుగేళ్లలో అదనంగా 12 లక్షల హెక్టార్లలో మొక్కలు పెంచాలన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం కూడా 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించింది.
హరిత హారంలో భాగంగా జూలై 11వ తేదీన అన్ని మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో, ఆయా వాతావరణానికి అనుకూలంగా ఉన్న మొక్కలను నాటుతామని తలసాని చెప్పారు.
మొక్కలను ప్రభుత్వం ఇవ్వనుంది 27 కేంద్రాలలో వీటిని సరఫరా చేయనుంది. కాగా, ప్లాంటేషన్లో తెలంగాణను బీట్ చేసేందుకే చంద్రబాబు కోటి మొక్కలు నాటాలని సూచించారా అనే చర్చ జరుగుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications