భారీ కాన్వాయ్‌తో చంద్రబాబు: ఫ్లెక్సీ దగ్ధం, చితకబాదిన తమ్ముళ్లు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ కాన్వాయ్‌తో వరంగల్ బయలుదేరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలతో కూడిన కాన్వాయ్‌తో చంద్రబాబు గురువారం ఉదయం రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి బయలుదేరారు.

వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో 500 కార్లతో ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రకాశ్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణలో టడీడీపీ బలపడుతోందన్న భయంతోనే అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కూతలు కూసినా భయపడేది లేదన్నారు.

టీడీపీ ఫ్లెక్సీ దగ్దానికి యత్నం, చితకబాదిన టీడీపీ కార్యకర్తలు

Chandrababu Warangal visit, MRPS to protest

వరంగల్ జిల్లాలోని హన్మకొండ రోడ్డుపై టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఓ యువకుడు తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో యువకుడిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని ఆగ్రహంతో అతడిపై పిడుగుద్దులు గుద్దారు. యువకుడి ద్విచక్రవాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరోవైపు, వరంగల్ సభా వేదిక వద్ద నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. దానిని పునరుద్ధరించారు.

చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్యే స్వాగతం

వరంగల్ జిల్లా పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు ఉప్పల్‌లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు వరంగల్ చేరుకుంటారు.

Chandrababu Warangal visit, MRPS to protest

అడ్డుకుంటామని చెప్పిన ఎమ్మార్పీఎస్

చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. వారు రోడ్ల పైకి వచ్చారు. విభజనకు ముందు చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి లేకుంటే తాము అండగా నిలిచామని, ఇప్పుడు తమను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే చంద్రబాబును అడ్డుకుంటామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+