విశాఖ, తిరుమలలో జగన్ గురువుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు
గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ జిల్లాలోని శారదా పీఠానికి కేటాయించిన భూముల కేటాయింపును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసింది. అంతే కాకుండా తిరుమల కొండపై శారదా పీఠం చేపట్టిన నిర్మాణాల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీటీడీ అధికారులకు సూచించింది. ఒకేసారి శారద పీఠానికి రెండు చోట్ల చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
భీమిలి మండలంలోని కొత్తవలసలో 15 ఎకరాల భూమిని విశాఖ శారదా పీఠానికి కేటాయిస్తు గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేద విద్యాశాల కోసం 15 ఎకరాల భూమి తీసుకున్న శారదా పీఠం నిర్వాహకులు ఆ తర్వాత ఆ భూమిని నివాసాలు, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఆతర్వాత విశాఖ శారద పీఠానికి కేటాయించిన భూముల విషయంపై చంద్రబాబు ప్రభుత్వం విచారణ చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక ఎకరా భూమిని కేవలం లక్ష రూపాయలు చెప్పున 15 లక్షల రూపాయలకు 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి ఇచ్చేసిందని, అయితే భీమిలి సమీపంలో ఒక ఎకరా భూమి రూ. 15 కోట్ల విలువ ఉంటుందని విచారణ చేపట్టిన అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 15 లక్షలకే శారద పీఠానికి ఇవ్వడం వలన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖజానాకు నష్టం వచ్చిందని విచారణ అధికారులు నివేదిక తయారుచేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం శారదా పీఠానికి భూములు కేటాయించిందని, ఆ భూముల కేటాయింపు రద్దు చేశామని శనివారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలిపింది. భీమిలి సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నది.












Click it and Unblock the Notifications